Posted on 2026-01-26 17:39:38
డైలీ భారత్, హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నియోజకవర్గంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బొల్లం మల్లయ్య వైఖరిని నిరసిస్తూ ఆదివారం హుజూర్‌నగర్ పట్టణ కేంద్రం రణరంగంగా మారింది. నిరసన జ్వాలలు హుజూర్ నగర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కుక్కడపు మహేష్ గౌడ్ పిలుపు మేరకు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇందిరా గాంధీ చౌక్ వద్దకు చేరుకున్నారు. బొల్లం మల్లయ్య యాదవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా కుక్కడపు మహేష్ గౌడ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు ప్రజల మనిషి, అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి మల్లయ్య యాదవ్‌కు లేదని మండిపడ్డారు. ఉనికి కోల్పోయిన మల్లయ్య యాదవ్, కేవలం వార్తల్లో నిలవడానికే ఇలాంటి దిగజారుడు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గానీ, కాంగ్రెస్ నాయకత్వంపై గానీ నోరు పారేసుకుంటే నియోజక వర్గంలో తిరగనివ్వబోమని తీవ్రంగా హెచ్చరించారు. మల్లయ్య యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >
జర్నలిస్ట్ మిత్రులకు హెల్మెట్స్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:21:35
Readmore >
సిరిసిల్ల : ఘనంగా భారతీయ జనతా పార్టీ పట్టణ విస్తృత స్థాయి సమావేశం
Posted On 2026-05-05 16:16:41
Readmore >
కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న
Posted On 2026-05-05 13:48:23
Readmore >
ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-05-05 13:06:31
Readmore >
కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్
Posted On 2026-05-05 12:50:37
Readmore >
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >