| Daily భారత్
Logo




35 యేండ్లుగా స్వర్గీయ జర్నలిస్ట్ నరేంద్ర స్మారక పోటీలు నిర్వహించటం అభినందీయం : డాక్టర్ జలగం తిరుపతి రావు

News

Posted on 2026-01-27 18:30:57

Share: Share


35 యేండ్లుగా స్వర్గీయ జర్నలిస్ట్ నరేంద్ర స్మారక పోటీలు నిర్వహించటం అభినందీయం : డాక్టర్ జలగం తిరుపతి రావు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: విధి నిర్వహణలో జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర ఆకస్మికంగా మరణించి 35 యేండ్లు గడుస్తున్న ఆయనను గుర్తు పెట్టుకుని జర్నలిస్టులు నరేంద్ర స్మారక క్రీడా పోటీలు నిర్వహించటం అభినందీయమని ప్రముఖ వైద్యుడు జలగం తిరుపతి రావు అన్నారు. నరేంద్ర మెమోరియల్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఆఫీసర్స్ క్లబ్ లో మంగళవారం జర్నలిస్టులకు షటిల్ టొర్నమెంట్ జరిగింది. ఈ పోటీలను ప్రారంభించిన ప్రముఖ వైద్యులు తిరుపతిరావు మాట్లాడుతూ అన్నిరకాల వయస్సుల గల జర్నలిస్టులు, వైద్యులు, అధికారులు అన్నిరంగాల్లో నిష్ణాతులైన ఉన్నారు. ఎంత వయస్సు ఉన్న సరే వయస్సు నంబరే తప్పా మనస్సుకు కాదన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి క్రీడాలు ఎంతో ఉపయోగ పడుతాయన్నారు. ప్రస్తుతం యువత మోబైల్లో గేమ్స్, వీడియో గేమ్స్ కు అలవాటై పోతున్నారు. మైదానంలో ఆడే క్రీడాలను పూర్తిగా మరిచి పోతున్నారు.

మైదానంలో ఆడే క్రీడాలతోనే శారీరకంగా, మానసికంగా, ఉత్సహంగా, ఉల్లాసంగా ఉంటుందన్నారు. చాలమంది చదువుతో ఒత్తిడిలకు గురైవుతున్నారు. అటువంటి వారికి ఆటలు ఆడటం అలవాటు ఉన్నట్లు అయితే ఒత్తిడిలు తగ్గి వారి ఆరోగ్యం మెరుగైతుందన్నారు. ఇలాంటి క్రీడాలను గత 35 సంవత్సరాలుగా పాత్రహిస్తున్న మల్లెపూల నరేంద్ర మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, కన్వీనర్, ప్రెస్ క్లబ్ జర్నలిస్టులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి సాయిలు, కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, ఐజేయూ నాయకులు బొబ్బిలి నర్సయ్య, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చింతల గంగాదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు

హైమద్ అలీఖాన్, ప్రెస్ క్లబర్ ప్రధాన కార్యదర్శి వాగ్మేరే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆఫీసర్స్ క్లబ్ మేనేజర్ సురేష్, జర్నలిస్టులు పాల్గొన్నారు. 

షటీల్ విజేతలు ... జర్నలిస్టు నరేంద్ర స్మారకార్ధం నిర్వహించిన షటిల్ పోటిల ఫైనల్ మ్యాచ్ లో భానుతేజ, సందీప్ ల పై శ్రీకాంత్, రాజలింగం జట్టు 6 -15 తేడాతో గెలుపొందింది.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >