| Daily భారత్
Logo




ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

News

Posted on 2026-01-28 18:35:11

Share: Share


ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్‌ పూర్తి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి  పర్యవేక్షణలో నిర్వహణ .2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా బుధవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి  నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్  హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో గల పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు (పీ.ఓ), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏ.పీ.ఓ)లను, ఇతర పోలింగ్ అధికారులు (ఓ.పీ.ఓ)లను ర్యాండమైజెషన్ ద్వారా కేటాయించారు. పోలింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్ చే పోలింగ్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ విధుల కోసం నియమించబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులతో అందజేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ కృష్ణరెడ్డి, మ్యాన్ పవర్ మ్యానేజ్మెంట్ నోడల్ అధికారి శ్రీలక్ష్మి, పిడి హౌసింగ్ చాంప్లా నాయక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >