| Daily భారత్
Logo




తన గెలుపుతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి బహుమానం ఇస్తా

News

Posted on 2026-01-30 20:31:06

Share: Share


తన గెలుపుతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి బహుమానం ఇస్తా

రెండవ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి బేగరి రవి వెల్లడి

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ చివరి రోజున నిజామాబాద్ రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బేగరి రవి శుక్రవారం నామినేషన్ దాఖలు వేశారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలోని మాణిక్ బండర్, మాణిక్ బండర్ తండా, బోర్గాం, దాస్ నగర్ ఇతర గ్రామాలలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రెండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బేగరీ రవి పేర్కొన్నారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధిష్టానం కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. తన విజయం ద్వారానే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డికి బహుమతిగా అందిస్తానని ఆయన ప్రకటించారు. అలాగే తన డివిజన్ లోని ప్రజల ఆశీర్వాదంతో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం రెండేళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆయన అన్నారు. డివిజన్ ను సమూలంగా అభివృద్ధి పతన నడిపిస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు ముందు ఉంటానని అన్నారు. ఏళ్ల తరబడిగా పేద ప్రజలకు అందివ్వని రేషన్ కార్డులు కేవలం రెండు సంవత్సరాల లోని అర్హులైన పేదవారి అందరికీ రేషన్ కార్డులతో పాటు, ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని ఆయన అన్నారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >