Posted on 2026-01-30 20:43:36
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం
కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబం గా ఎదుగుతుంది
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ఉండాలని పట్టు పట్టిన నేత దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భూసంస్కరణలకు ఆధ్యుడైన మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు విద్యనభ్యసించిన మొగిలిగిద్ద పాఠశాల తెలంగాణ చరిత్రలో గర్వకారణం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు,రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ఆలోచన చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజక వర్గంలో అల్పాహార పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే ప్రారంభించామని వివరించారు. మా సంకల్పం గొప్పది ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, అన్ని వనరులు సమకూరితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకం ప్రవేశపెడతామని తెలిపారు. ఎదిగే వయసులో పిల్లలకు సరైన ఆహారం లేక పరిపూర్ణంగా ఎదగలేక పోతున్నారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తుందని తెలిపారు.
కామన్ స్కూల్ విధానం ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబం గా ఎదుగుతుంది చిన్ననాటి నుంచే అందరం కలిసిపోయాం అనే భావన కులం, మతం, ధనిక ,
పేద తేడా లేదన్న నిర్మాణాత్మక ఆలోచన సమాజంలో పెరుగుతుందనే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తుందని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారి ఒక్కో పాఠశాలను 25 ఎకరాలు విస్తీర్ణంలో 200 కోట్ల బడ్జెట్ తో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజక వర్గాల్లో 20వేల కోట్లు వెచ్చిస్తూ ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలంటే గొప్ప మానవ వనరులు ఉండాలి, మానవ వనరులకు సానపడితేనే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది అందుకు కావలసింది ఉచితంగా అందరికీ విద్య, వైద్యం ప్రజా ప్రభుత్వం ప్రధానంగా ఈ రెండు అంశాలపైనే దృష్టి సారించి ముందుకు పోతుందని అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే పాఠశాల నిర్వాహకులు పిలవగానే గత సంవత్సరం జనవరి మాసంలో సీఎం రేవంత్ రెడ్డి మొగిలిగిద్ద పాఠశాలకు వచ్చి పది కోట్లు కేటాయించారని వివరించారు. ఆ నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
గత పాలకులు ఐఐటీలను అనాధలుగా వదిలేస్తే మారిన కాలానికి అనుగుణంగా వాటిలో శిక్షణ ఇవ్వాలని, ఆధునిక యంత్ర పరికరాలను తీసుకువచ్చి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చి ఉపాధి పొందేందుకు అవసరమైన సిలబస్ను రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఐటిఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 రోజుల వ్యవధిలోనే అధికారులతో నివేదిక తెప్పించుకొని డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు.
హైదరాబాద్ చుట్టూ ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుంది, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరించామని వివరించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నాణ్యమైన చీరలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పంపిణీ చేస్తున్నాం వారిని మహాలక్ష్ములుగా గౌరవిస్తున్నామని తెలిపారు.
మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దెందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం మొదటి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామంటే అంతా నవ్వారు కానీ మేం పట్టుదలతో మొదటి ఏడాది 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేసి ఇది సాధ్యమని నిరూపించినట్లు వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు ఈ దేశంలో భూ సంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకృష్ణారావు అని వివరించారు. దివంగత ముఖ్యమంత్రులు బూర్గుల రామకృష్ణారావు, మర్రి చెన్నారెడ్డి తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ ప్రొఫెసర్ హ రగోపాల్ వంటి అనేకమంది ప్రముఖులను మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల దేశానికి సమాజానికి అందించిందని తెలిపారు.
రాజు దైవంశ సంభూతుడు అన్న భావన ఒకవైపు, భూమికోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం మరోవైపు కొనసాగుతున్న రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాలు నడిపించి నిజాం వ్యతిరేక పోరాటం చేసిన గొప్ప నాయకుడు బూర్గుల రామకృష్ణారావు అని తెలిపారు. బూర్గుల మొదట న్యాయవాద వృత్తిని చేపట్టిన తన జీవితం ప్రజల కోసం ఉపయోగపడాలని రాజకీయాల్లోకి వచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు.
హైదరాబాద్ ముఖ్యమంత్రిగా 1950- 54 మధ్యకాలంలో కౌలు గారి చట్టం తీసుకువచ్చి సాగు చేసుకునే వారికి భూమిపై హక్కులు కల్పించి దేశంలో భూసంస్కరణలకు బూర్గుల ఆధ్వర్యంలో నిలిచారని తెలిపారు. జాగిరి దారి వ్యవస్థ, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారని తెలిపారు. దేశంలో 1970లో తీసుకువచ్చిన భూ సంస్కరణల చట్టానికి బూర్గుల బాధ్యుడిగా నిలిచారని తెలిపారు. సాయుధ పోరాటం వంటి సమస్యలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం చూపిన మహానేత బూర్గుల అని వివరించారు.
150 సంవత్సరాల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద పాఠశాల గొప్పది ఈ పాఠశాలలో 1952 వరకు ఉర్దూ మీడియం లో కొనసాగగా, ఆ తరువాత తెలుగు మీడియాను ప్రవేశపెట్టారని వివరించారు. 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండాలని పట్టుబట్టి ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ఆరోజు శాసనమండలిలో చర్చ జరుగుతుండగా నాటి సీఎం వైఎస్ ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న తన వైపు చూసి మాట్లాడవలసిందిగా సూచించారని గుర్తు చేశారు.
బిడ్డలు చదువుకుంటే ఉద్యోగాలు, ఉపాధి సాధిస్తారని తల్లిదండ్రులు కూలి నాలి చేసి పంపుతున్నారు తీరా ఉద్యోగం రాకపోతే వారు కూలీలుగా మారిపోతున్నారు ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీష్ తప్పనిసరి అయింది, ప్రపంచం కు గ్రామంగా మారింది, ఇంగ్లీష్ ప్రపంచ భాష అది నేర్చుకుంటేనే ఉపాధి భవిష్యత్తు ఉంటుందని ఆనాడు సభలో తన అనుభవాలను వివరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రొఫెసర్ హరగోపాల్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణయ్య అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బండారి సంతోష జిల్లా విద్యాశాఖ అధికారి సుసింధర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >