Posted on 2026-01-31 00:32:30
డైలీ భారత్ మేడారం: తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం మస్మక్క-సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. జనవరి 28న ప్రారంభమైన జాతర జనవరి 31 వరకు కొనసాగుతుంది.
సమ్మక్క, సారలమ్మను గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకురావడంతో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. అడవి తల్లులను దర్శించుకునేందుకు లక్షల మంది జనం మేడారం బాటపట్టారు. ఇదిలా ఉంటే ఈసారి మేడారం జాతరలో ఓ లేడీ ఐపీఎస్ అధికారి స్పెషల్ ఎట్రాక్షగా నిలిచారు. జాతర విధుల్లో ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌వుతున్నాయి.
కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్
ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా ఉన్న వసుంధర యాదవ్, యూపీ నేపథ్యం కలిగిన తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి. మేడారం జాతరలో భద్రతా ఏర్పాట్లకు నాయకత్వం వహిస్తున్నారు. సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీతో కలిసి కార్యక్రమానికి ఉత్సవ స్ఫూర్తిని జోడించారు.
వైరల్ మూమెంట్స్
సమ్మక్క రాక సమయంలో తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన సమయంలో ఆమె కేరింతలు, సారలమ్మ గద్దెల వద్ద మంత్రి సీతక్కతో కలిసి ఆమె చేసిన స్టెప్పులు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్స్ లక్షలాది వ్యూస్ సాధించాయి. వసుంధర యాదవ్ ఉత్సాహం, చురుకుదనం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
నెటిజన్ల ప్రశంస
వసుంధర యాదవ్ చురుకుదనం, విధినిర్వహణలో నిష్ట, క్రమశిక్షణ, ఉత్సాహం చూపి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సాధారణ పోలీస్ విధులకు అతీతంగా జాతర స్ఫూర్తిలో పాలుపంచుకోవడం అరుదు. దీని వల్ల ఆమె "స్పెషల్ అట్రాక్షన్" గా నిలిచి, మహిళా అధికారులకు ఆదర్శంగా మారారు. ఈ ట్రెండ్ భద్రతా బలగాలకు కూడా సానుకూల ఇమేజ్‌ను పెంచుతోంది.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >