Posted on 2026-01-31 11:16:58
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు.
నాంపల్లికి చెందిన వ్యాపారి రషీద్ ఉదయం 7 గంటలకు ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలో రూ.6లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు ఒక బ్యాగ్‌తో వచ్చాడు. రషీద్ డబ్బులతో రావడం గమనించిన కొందరు దుండగులు, అతని చేతిలోని బ్యాగును లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. అది గమనించిన రషీద్ ప్రతిఘటించడంతో అతనిపై కాల్పులు జరిపి డబ్బుల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ గాయమైంది
కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రషీద్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు. క్లూస్ టీమ్స్ ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించాయని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఉదయం 6.30 గంటల నుంచి 7 గంటల మధ్య ఈ ఘటనపై తమకు కాల్ వచ్చిందని.. వెంటనే అలర్ట్ అయ్యామని పేర్కొన్నారు. నిందితుల కోసం ఐదు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నిందితులు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >