| Daily భారత్
Logo




బి ఫామ్ కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్, బారాస పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు

News

Posted on 2026-02-02 13:23:20

Share: Share


బి ఫామ్ కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్, బారాస పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు

ఇప్పటికే ప్రకటించిన బిజెపి, ఎంఐఎం పార్టీలు

పార్టీ టికెట్ల కోసం చూస్తున్న ఆ పార్టీల కు చెందిన ఆశావాహులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే బిజెపి, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి బీఫామ్ సర్టిఫికెట్లు కూడా అందజేశారు. కాంగ్రెస్, బారాస పార్టీలు ఇప్పటికీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోగా మీనమేశాలు లెక్కిస్తుంది. ఇప్పటికే సమయం కొద్దిగా ఉన్న నేపథ్యంలో నేడు రేపు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలు ఇప్పటికీ ఎందుకు తమ అభ్యర్థులను ప్రకటించడం లేదో తీవ్ర చర్చనీయంశంగా మారింది. తమ అభ్యర్థులను ప్రకటించడంలో ఎందుకు అంతర్ మదన పడుతున్నారో వారికే తెలియడం లేదు. ఒక సమావేశంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకె టికెట్ ఇవ్వాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  కరాకండిగా చెప్పిన విషయం తెలిసిందే. అందుకే జిల్లా పార్టీ అధిష్టానం అభ్యర్థుల పేర్లను చేయడం లేదా అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలు వారు కేటాయించిన అభ్యర్థులకు కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే రెబెల్స్ బెడద ఉంటుందని అందుకే ఆ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం లేదని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు బిజెపి పార్టీ తమ అభ్యర్థులకు టికెట్లను కేటాయించడంతోపాటు బి ఫాం సర్టిఫికెట్లు కూడా అందజేయడంతో వారు లోలోపన ప్రచారాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా ఆ రెండు పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించి బీఫామ్ సర్టిఫికెట్లు అందివ్వకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద దెబ్బ ప్రజలను ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >