Posted on 2026-02-07 11:16:22
డైలీ భారత్, సిరిసిల్ల: మహిళను వేధించిన కేసులో ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 6000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు కే. కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు..
సుభాష్ నగర్ కు చెందిన ఒక మహిళ యొక్క భర్త బతుకుదెరువు నిమిత్తం సౌదీ దేశంలో వెళ్లగా, ఆమెకు ఇద్దరు కూతుర్లు ముగ్గురు కుమారులు సంతానం కాగా తన కులానికి చెందిన ఎండి మజీద్ అను అతను తనపై దురుద్దేశంతో ఇబ్బందులకు గురి చేయొచు తను ఎటు పోయిన వెంబడించడం రకరకాల ఫోన్ నెంబర్లనుండి ఫోన్ చేసి మాట్లాడడం, వేధింపులకు గురి చేయడం చేయగా తన కుల పెద్ద మనుషుల కు చెప్పగా అందుకు అతన్ని మందలించగా అతడు కొద్ది రోజులు ఊరుకున్నాడు. కొద్ది రోజులు మంచిగానే ఉండి మళ్ళీ పాతవిధాంగానే తనపై దురుద్దేశంతో వెంబడించడం తనతో ఫోన్లో మాట్లాడాలని తన కోరికలు తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నాడని, తేది. 22. 2.2021 నాడు బీడీల కంపెనీకి వెళ్ళుచుండగా సుభాష్ నగర్ సిరిసిల్లలోని యెల్ల లక్ష్మీనారాయణ ఇంటి ఎదురుగా మజీద్ వెంబడించి తన చెయ్యి పట్టుకుని లాగి తనతో ఫోన్ మాట్లాడాలని అతను చెప్పినట్లు విని అతని కోరికలు తీర్చాలని లేకపోతే చంపుతానని బెదిరించినాడని తన యొక్క పరువు తీసినాడు అని సుభాష్ నగర్ కు చెందిన ఒక మహిళ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై జి.సుధాకర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడు ఆయన ఎండి.మజీద్ సన్నాఫ్ యూసఫ్ అను అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అనంతరం ఎస్ఐ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తర్వాత సీఎంఎస్ ఎస్ఐ.శ్రావణ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ఏడు (7)మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల సందీప్ వాదించగా కేసు పూర్వకరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ ప్రవీణ్ నేరస్తుడు అయిన ఎండి.మజీద్ కు రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 6000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కే కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >