| Daily భారత్
Logo




ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే మున్సిపల్ అభివృద్ధి సాధ్యం : మొహమ్మద్ ఇబ్రహీం

News

Posted on 2026-02-08 20:27:56

Share: Share


ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే మున్సిపల్ అభివృద్ధి సాధ్యం : మొహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా; షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే సాధ్యమని సీనియర్ నాయకులు ఎం.డి. ఇబ్రహీం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దిలీప్ కుమార్ కు మద్దతుగా ఆయన వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి, దిలీప్ కుమార్ కు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.అనంతరం ఇబ్రహీం మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల స్వల్ప కాలంలోనే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం సుమారు 1350 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయించారని గుర్తు చేశారు. వార్డుల్లో కనిపిస్తున్న సిసి రోడ్లు, అత్యాధునిక అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు వంటి మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వార్డును మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, ఎమ్మెల్యే ఆశీస్సులతో దిలీప్ కుమార్ ను గెలిపించుకోవాలని ఆయన వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇసాక్,సత్తయ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >