Posted on 2026-02-09 10:09:26
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
డైలీ భారత్, వరంగల్: మున్సిపల్ ఎన్నికల సంబంధించి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ ప్రచారం ముగుస్తుంది, తరువాత బయటి వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఉండరాదు.
అలా ఉన్నట్లు అయితే వారిపై చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే జనగామ, ఘన్పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచారం నిమిత్తం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రచార సిబ్బంది మరియు ఇతరులు అందరూ తప్పనిసరిగా సోమవారం సాయంత్రం 5.00 గంటల లోపు తమ తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్లిపోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ తెలియజేయడమైనది. నిర్దేశిత సమయం అనంతరం కమిషనరేట్ పరిధిలో అనవసరంగా సంచరిస్తున్నట్లు గుర్తించినట్లయితే, సంబంధిత వ్యక్తులపై ఎన్నికల నిబంధనలు మరియు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. ప్రజలు మరియు రాజకీయ పార్టీలు పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరడమైనది.
#warangal
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >