Posted on 2026-02-10 19:41:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మున్సిపాలిటీ ఎన్నికల విధుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్ మరియు కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు.మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి సంబంధించి శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ అధికారులకు ఇచ్చిన ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని పరిశీలించారు.ఈ సందర్బంగా సాధారణ పరిశీలకులు మయంక్ మిట్టల్ మాట్లాడుతూ పోలింగ్ విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ చెక్ లిస్ట్ ప్రకారం ఎన్నికల సామగ్రిని సరిచూసుకున్న తరువాతనే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి బయలుదేరి వెళ్లాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరిస్తూ విధులు బాధ్యతగా నిర్వహించాలని అన్నారు. 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. గడువు లోపు పోలింగ్ కేంద్రం లోనికి చేరుకున్న ఓటర్లకు సాయంత్రం 5.00 గంటలు దాటిన తరువాత కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించామన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కావాల్సిన సామాగ్రిని పోలింగ్ కేంద్రం వారిగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా అంకితభావంతో కృషి చేయాలని ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. ఎక్కడ కూడా రీపోలింగ్ కు ఆస్కారం లేకుండా పక్కాగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని, ఓటింగ్ సందర్భంగా గోప్యతను కాపాడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను, పోలింగ్ బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్ చేసి ప్యాక్ చేయాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి పోలింగ్ కేంద్రం చేరుకొని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారణ చేసుకోవాలన్నారు. చెక్ లిస్ట్ ప్రకారం పోలింగ్ మెటిరియల్ క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని సరిగా ఉన్నాయని నిర్దారణ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి బయలుదేరాలని సూచించారు. ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని, పోలింగ్ సిబ్బంది నిర్వహించే వారి విధులను క్షుణ్ణంగా వివరించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలని అన్నారు. శేరిగూడలో మండల్ పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. మహేశ్వరం డిసిపి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత కల్పించడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >