| Daily భారత్
Logo




రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సిద్దిపేట పోలీసుల సత్తా... విజేతలను అభినందించిన పోలీస్ కమిషనర్

News

Posted on 2026-02-24 12:41:45

Share: Share


రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సిద్దిపేట పోలీసుల సత్తా... విజేతలను అభినందించిన పోలీస్ కమిషనర్

డైలీ భారత్, సిద్దిపేట: 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు మరియు స్పోర్ట్స్ మీట్ - 2026లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులను , సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ క్రీడల్లో సిద్దిపేట పోలీస్ యూనిట్ నుండి మొత్తం 09 మంది పోలీస్ సిబ్బంది వివిధ విభాగాల్లో పోటీపడి, తమ ప్రతిభతో జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు. మొత్తం 12 పతకాలను సాధించి సిద్దిపేట పోలీస్ శాఖ సత్తాను రాష్ట్ర స్థాయిలో చాటారు.

పతకాల వివరాలు:

బంగారు పతకాలు : 03

1. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రోహిత్ , 2. సబ్ ఇన్స్పెక్టర్ అంజయ్య , 3.  కానిస్టేబుల్ డి. రాజు.

వెండి పతకాలు : 02

1. డి లక్ష్మణ్ , 2. జె. రాజు.

కాంస్య పతకాలు : 07

మొత్తం పతకాలు: 12

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ గారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ, క్రీడల పట్ల మక్కువతో కష్టపడి సాధన చేసి పతకాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక ఉల్లాసానికి మరియు క్రమశిక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాబోయే రోజుల్లో పోలీస్ శాఖ పరంగా పూర్తి సహకారం ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధించాలని  ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో  అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఎ ఆర్ సుభాష్ చంద్రబోస్ , ఇన్స్పెక్టర్లు కిరణ్ , శ్రీధర్ గౌడ్  పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.



#Telangana State Police

Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >