Posted on 2026-02-26 09:53:54
జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు , శిక్షలతోనే సమాజంలో మార్పు
నిందుతులకు శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను , పిపిలను,కోర్ట్ కానిస్టేబుల్లను అభినందించిన జిల్లా ఎస్పీ.
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: మైనర్ బాలిక పై బలవంతపు వేధింపుల (పొక్సో) కేసులో ఇద్దరు నిందితులకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2000/-రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను 2021 సంవత్సరంలో వరుసకి అన్న అయిన తూర్పటి ప్రవీణ్ S/o జానీ అను అతను బలవంతపు వేధింపులకు గురి చేయగా అట్టి విషయంలో ప్రవీణ్ తండ్రి అయిన జానీ మరియు నానమ్మ అయిన పొచవ్వ లు ఎవరికైనా చెప్తే చంపేస్తాం అని బాధితులని బెదిరించారు. ఇట్టి విషయం పై బాధితురాలి యెక్క తల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ వెంకటకృష్ణ కేసు నమోదు చేయగా దర్యాప్తు అనంతరం అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినాడు
ప్రాసిక్యూషన్ తరపున పి.పి.లు వేముల లక్ష్మీ ప్రసాద్, పెంట శ్రీనివాస్ వాదించగా,CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్లు శ్రీనివాస్,నవీన్ లు కోర్టులో 10 మంది సాక్షులను ప్రవేశపెట్టాగా,కేసు పూర్వాపరాలను పరిశీలించిన సిరిసిల్ల పొక్సో కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ గారు ఇద్దరు నిందుతులు అయినటువంటి తూర్పటి జానీ,తూర్పటి పొచవ్వకి నాలుగు సంవత్సరల జైలు శిక్ష తో పాటు ఒక్కక్కరికి 2000/- రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు.తూర్పటి ప్రవీణ్ మైనర్ కావడం వలన అతని మీద కేసు ప్రస్తుతం జువెనైల్ కోర్టులో నడుస్తుందని తెలిపారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.
పైకేసులలో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీలు వేముల లక్ష్మీ ప్రసాద్,పెంట శ్రీనివాస్,CMS ఎస్.ఐ రవీంద్రనాయుడు,కోర్ట్ కానిస్టేబుల్ లు నవీన్, శ్రీనివాస్, అప్పటి పోలీస్ అధికారులు ఎస్.ఐ వెంకటకృష్ణ,డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >