| Daily భారత్
Logo




ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్

News

Posted on 2026-02-26 15:43:15

Share: Share


ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్

 సీఎం కప్ విజేతలకు అభినందనలు

 కామారెడ్డి కలెక్టరేట్‌లో అభినందన కార్యక్రమం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో సేవా కార్యక్రమాలతో ముందంజలో ఉన్న ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలైన బిబిపేట మండల కరాటే విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో మెరిసిన కరాటే విద్యార్థులు డాకూరి రోహిత్, మైనస్ 63 కేజీల విభాగంలో బ్రౌన్స్ పతకం, చిట్టబోయిన వంశీ , సిల్వర్ పతకం సాధించిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లాభాపేక్ష లేకుండా విద్యార్థుల అభివృద్ధికి, క్రీడలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తూ ఎస్ ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లో  సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో  మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనీ,పేదలకు మరింతగా సేవలు అందిస్తూ, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఫౌండేషన్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విట్టర్, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బిబిపేట మండల మాజీ వైస్ ఎంపీపీ కప్పరా రవీందర్ రెడ్డి, మాందాపూర్ సర్పంచ్ హరీష్, కుమ్మరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >