| Daily భారత్
Logo




వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు : ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

News

Posted on 2026-02-26 16:32:50

Share: Share


వంద తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్లు : ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

పైలెట్ ప్రాజెక్టు త‌ర‌హాలో నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌టి

ఆరుట్ల పాఠ‌శాల త‌ర‌హాలో స‌క‌ల వ‌స‌తులు, ర‌వాణా సౌక‌ర్యం క‌ల్ప‌న‌

క్యూర్‌లో ఏడాదిలో స‌క‌ల వ‌స‌తుల‌తో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు సిద్ధం కావాలి..

99 రోజుల కార్య‌క్ర‌మంలో వారం రోజులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో కార్య‌క్ర‌మాలు

ఏఐ సాంకేతిక‌పై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ‌

ప్రాథ‌మిక నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు బ్రేక్‌ఫాస్ట్ 

విశ్వ విద్యాల‌యాల‌కు నిధులు అంద‌జేత‌పై నివేదిక స‌మ‌ర్పించండి..

విద్యా శాఖపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రికి తెలంగాణ విద్యా విధానం నివేదిక అంద‌జేసిన క‌మిష‌న్ స‌భ్యులు

నివేదిక‌లో చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిన అంశాలు.. అమ‌లు చేయాల్సిన అంశాల‌పై కేశ‌వ‌రావు క‌మిటీకి అప్ప‌గింత‌

ఫీజుల నియంత్ర‌ణ‌పై రిటైర్డ్ జ‌డ్జి లేదా రిటైర్ చీఫ్ సెక్ర‌ట‌రీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర క‌మిటీ

డైలీ భారత్, హైద‌రాబాద్:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో (హైద‌రాబాద్ న‌గ‌రం వెలుప‌ల‌) తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ల‌ను ఈ ఏడాది నుంచి ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. త‌ర‌గ‌తి గ‌దులు, క్రీడా మైదానం, ఇత‌ర అన్ని ర‌కాల వ‌స‌తులు, బోధ‌నా సిబ్బంది, ర‌వాణా సౌక‌ర్యం క‌లిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్ త‌ర‌హాలోనే ఈ వంద స్కూళ్లు ఉండాల‌ని సీఎం ఆదేశించారు. విద్యా శాఖ‌పై కమాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. నాణ్య‌మైన విద్య‌కు చిరునామాగా తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దాల‌ని సీఎం పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్య‌య‌మైనా వెనుకాడేది లేద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ (క్యూర్‌) ప‌రిధిలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల త‌ర‌హాలో నిర్మించాల‌ని సీఎం ఇంజినీర్ల‌ను ఆదేశించారు. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని, ఏడాదిలో క్యూర్ ప‌రిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూత‌న పాఠ‌శాల‌ల నిర్మాణం పూర్తి కావాల‌ని  సీఎం ఆదేశించారు. న‌గ‌రంలోని భార‌తీయ విద్యా భ‌వ‌న్‌, జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూళ్ల‌లో ఉండే అన్ని వ‌స‌తులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠ‌శాల‌ల్లో ఉండాల‌ని సీఎం తెలిపారు. క్యూర్‌లో అప్‌గ్రేడ్ చేయ‌నున్న 17 పాఠ‌శాల‌లు, అద‌న‌పు గ‌దులు, ఇత‌ర వ‌స‌తులు క‌ల్పించ‌నున్న 164 పాఠ‌శాల‌ల ప‌నుల్లో ఎటువంటి రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో 99 రోజుల పాటు చేప‌ట్ట‌నున్న కార్య‌క్ర‌మాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాల‌కు కేటాయించాల‌ని సీఎం సూచించారు. ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌ను సంద‌ర్శించి అవ‌స‌ర‌మైన వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఇత‌ర అంశాల‌ను తెలుసుకొని వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

కృత్రిమ మేథ (AI) ప్ర‌పంచాన్ని శాసిస్తున్న నేప‌థ్యంలో పాఠ‌శాల స్థాయి నుంచి దాని బోధ‌న‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మారుతున్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చ‌ర‌ర్ల‌కు స్వ‌ల్ప‌కాలిక శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. AIతో ప్రపంచ వ్యాప్తంగా వ‌చ్చే మార్పుల‌ను తెలుసుకొని దాని ద్వారా వ‌చ్చే అవ‌కాశాలు మ‌న విద్యార్థులే  అందిపుచ్చుకునేలా మ‌న స‌న్న‌ద్ధ‌త ఉండాల‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణ‌మైన మార్పుల‌ను తీసుకురావాల‌ని సీఎం పేర్కొన్నారు. 2026-2027 విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు బ్రేక్ ఫాస్ట్ అమ‌లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్రేక్ ఫాస్ట్ అంద‌జేత‌కు సంబంధించి అధికారులు, హ‌రేకృష్ణ‌మిష‌న్ ప్ర‌తినిధుల‌కు సీఎం ప‌లు సూచ‌న‌లు చేశారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ప్ర‌తి విద్యార్థికి పాలు అంద‌జేయాల‌ని.. ఇందుకు పాల‌ను విజ‌యా డెయిరీ నుంచి సేక‌రించాల‌ని సీఎం ఆదేశించారు. విద్యార్థుల‌కు ఎన్ని క్యాల‌రీలు అంద‌జేస్తున్నామ‌నేది తెలుసుకునేందుకు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. 

పాఠ‌శాల విద్యార్థుల‌కు స్కూల్ యూనిఫాం, పుస్త‌కాల‌తో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అంద‌జేయాల‌ని అందులో స్కూల్ బ్యాగ్‌, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప‌న‌ర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్ష‌న‌రీ, బూట్లు, సాక్సులు ఉండాల‌ని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బ‌డ్జెట్‌లో పొందుప‌ర్చేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.


#RevanthReddy #Telangana

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >