Posted on 2026-02-26 17:13:31
ఒకరికి 7 రోజుల జైలు శిక్ష, 12 మందికి జరిమానా
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల ప్రాణ భద్రతను పరిరక్షించడం లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మందిని గుర్తించి, వారి పై కేసులు నమోదు చేసి గౌరవ కోర్టులో హాజరుపరచడం జరిగింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, గౌరవ కోర్టు 12 మందికి జరిమానా విధించడంతో పాటు, ఒక నిందితుడికి 7 రోజుల సాదారణ జైలు శిక్ష విధించింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం మాత్రమే కాకుండా, అత్యంత ప్రమాదకరమైన చర్య. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా జరిగే ప్రమాదాల్లో వాహనం నడిపే వ్యక్తి ప్రాణంతో పాటు, ఇతర నిరపరాధుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి తన కుటుంబం, పిల్లలు మరియు తనపై ఆధారపడిన వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ప్రజలు కేసులు, కోర్టు చర్యలు మరియు జరిమానాల గురించి మాత్రమే ఆలోచించకుండా, స్వచ్ఛందంగా తమ ప్రాణ భద్రత, కుటుంబ భద్రత మరియు సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >