Posted on 2026-02-27 08:14:33
2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం?
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు రంగం సిద్ధమవుతున్నది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్ణయించిందని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. 6వ తరగతి విద్యార్థులు మూడు భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు కచ్చితంగా భారతీయ భాషలై ఉండాలి. అయితే ఈ కొత్త విధానంలో ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా పరిగణిస్తారు.
ఇప్పటికే 6వ తరగతిలో ఆంగ్ల భాషను బోధిస్తున్నందున దీనిని విదేశీ భాషగా లెక్కకడతారు. వీటితో పాటు రెండు భారతీయ భాషలను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం 8వ తరగతి వరకే అమలవుతుందని పేర్కొంటున్నా, 9, 10 తరగతులకు కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. అంటే 2031 నాటికి 10వ తరగతి బోర్డ్ పరీక్ష రాసే విద్యార్థులు మూడో భాషా పరీక్షను కూడా రాయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు విద్యార్థులు రెండు భాషా పేపర్లకు మాత్రమే హాజరవుతున్నారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >