Posted on 2026-02-27 23:58:47
డైలీ భారత్ డెస్క్: ఓఆర్ఆర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనులన్నీ ఆ చట్టం ఆధారంగా ఉండాలని సూచించారు.కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, రోడ్ల నాణ్యత, వీధి దీపాల మానిటరింగ్, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆర్ & బీ తదితర విభాగాల పరిధిలోని రోడ్లన్నీ ఎంఏయూడీ పరిధిలోకి తేవాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, చెరువులు–కుంటల అభివృద్ధి, సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏయూడీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఈ.వి. నరసింహారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు కర్ణన్, జి. సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >