Posted on 2026-02-28 11:20:50
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆరోగ్యంగా గడపాలి
కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమం
శాలువా, పూలమాలతో సత్కరించి సాదరంగా సాగనంపిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర., ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: పోలీసు వ్యవస్థలో దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు వెలకట్టలేనివని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ కొనియాడారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై డి. శ్రీరామ్ మరియు కలెక్టర్ ఆఫీస్ ఎస్సై డి. ఉదయ్ శేకర్ ల పదవీ విరమణ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ పదవీ విరమణ పొందుతున్న అధికారులను, వారి సతీమణులను శాలువా మరియు పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
కుటుంబాలకు దూరంగా ఉంటూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమించడం గర్వకారణమని అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో వీరి పాత్రను అభినందించారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై డి. శ్రీరామ్ మరియు ఎస్సై డి. ఉదయ్ శేకర్ 1989లో పోలీసు కానిస్టేబుల్స్‌గా తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించి, సుమారు 37 ఏళ్ల పాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించారు. వీరిద్దరి సుదీర్ఘ ప్రస్థానం నిబద్ధతతో కూడినదని, దశాబ్దాల పాటు ప్రజల రక్షణ కోసం వారు చేసిన కృషి వెలకట్టలేనిదని జిల్లా ఎస్పీ గారు ఈ సందర్భంగా కొనియాడారు.
పోలీసు విధుల్లో వారు గడించిన అపారమైన అనుభవం, వృత్తి పట్ల చూపిన అంకితభావం నేటి యువ పోలీసు అధికారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఎస్పీ గారు పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లోనూ ధైర్యంగా బాధ్యతలు నిర్వహించి, వ్యవస్థలో తమదైన ముద్ర వేసిన ఇలాంటి అధికారుల సేవలను శాఖ ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని ఆయన అభినందించారు.
పదవీ విరమణ అనంతరం వీరు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి ఆరోగ్యంతో, సుఖసంతోషాలతో గడపాలని ఎస్పీ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్, కృష్ణ, పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య అధికారులకు సాదరంగా వీడ్కోలు పలికారు.
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >