| Daily భారత్
Logo




కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 18 మంది మృతి

News

Posted on 2026-02-28 11:33:01

Share: Share


కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 18 మంది మృతి

డైలీ భారత్, కాకినాడ: ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం-జి.మేడుపాడు మధ్య భారీ పేలుడు సంభవించింది. ఒక బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మందికిపైగా మరణించినట్లు సమాచారం. మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

ఘటనా స్తలంలో ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాద స్థలంలో ఇంకొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇది స్తానికుల నుంచి అందిన ప్రాథమిక సమచారం. అయితే, మృతులు, క్షతగాత్రుల విషయంలో అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. పేలుడు ధాటికి మృతదేహాలు పొలాల్లోకి ఎగిసిపడ్డాయి. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో అక్కడ 20 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఇంకా పేలుడు కొనసాగుతోంది. పరిమితికి మించి బాణాసంచా తయారు చేయడం వల్లే ఈ ఘటన అని ప్రాథమిక అంచనా.

స్థానిక పెదపూడి రోడ్డులోని పొలాల్లో అడపా నాని కుటుంబ సభ్యులు ఒక బాణాసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు అక్కడే ఉండటంతో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలు అదుపులోకి తేవడం కష్టంగా మారింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్తానికులు భయాందోళనకు గురయ్యారు.

Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >