| Daily భారత్
Logo




100 రోజుల సమగ్ర ఆరోగ్య సేవల ప్రత్యేక కార్యక్రమం

News

Posted on 2026-02-28 13:19:34

Share: Share


100 రోజుల సమగ్ర ఆరోగ్య సేవల ప్రత్యేక కార్యక్రమం

మార్చి 4 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందరోజుల సమగ్ర ఆరోగ్య సేవల ప్రత్యేక కార్యక్రమం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో ప్రజలకు మరింత సమగ్ర మరియు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు వందరోజుల ఆరోగ్య కార్యక్రమాన్ని మూడు దశలలో అమలు చేయనున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే లలితాదేవి తెలిపారు. మొదటి దశ మార్చ్ 4 నుండి మార్చి 31 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు స్పెషలిస్ట్ వైద్యులు నిర్ణయించిన తేదీలలో క్యాంపులు ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్షిస్తారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి సన్నాహక సమావేశము జిల్లా డిప్యూటీ జిల్లా వైద్యాధికారుల మరియు ప్రోగ్రాం అధికారులతో కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు జూము మీటింగ్ నిర్వహించడం జరిగింది. మొదటి దశలో మాతృ మరియు మహిళా ఆరోగ్యము శిశు ఆరోగ్యంలో భాగంగా అనీమియా స్క్రీనింగ్ మరియు చికిత్స ఐ ఎఫ్ ఏ మాత్రల పంపిణీ హైరిస్క్ గర్భిణీల గుర్తింపు మరియు పర్యవేక్షణ , ప్రసవానంతరం 14 రోజులలోపు గృహ సందర్శనలు మెన్సెస్ పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలు, స్థన మరియు గర్భాశయ ముఖ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం లో నిపుణులైన గైనకాలజిస్ట్ ల చే పరీక్షించి గుర్తించిన వారికి చికిత్స అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి టీకాల కార్యక్రమం బలోపేతం జీరో డోస్ పిల్లల గుర్తింపుమరియు ట్రాకింగ్ విటమిన్ ఎ పంపిణీ చిన్న పిల్లల డాక్టర్ ల చే గుర్తించి చికిత్స అందజేస్తారు. యువత కోసం అనీమియా నివారణ చర్యలు పరీక్షల ఒత్తిడి నివారణ చర్యలు పరీక్షల ఒత్తిడి నివారణ కౌన్సిలింగ్ మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక జేరియాట్రిక్ క్యాంపులు నిర్వహించి రక్కపోటు మధుమేహం మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి రిఫరల్ సేవలు అందించడం జరుగుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అంగన్వాడీలు సెల్ఫ్  హెల్ప్ గ్రూపులు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీ గా అమలు చేస్తున్నట్లు తెలిపారు గ్రామ పట్టణ స్థాయిలో విస్తృత స్క్రీనింగ్ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 

ఆర్ బి ఎస్ కే వైద్యుల ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలో కంటి పరీక్షలు రక్తహీనత పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ గీతా డాక్టర్ రాధిక డాక్టర్ పాపారావు డాక్టర్ లక్ష్మీప్రసన్న మరియు ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శిభా హయత్ మరియు డెమో శ్రీనివాసులు మరియు సూపర్వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >