| Daily భారత్
Logo




గ్రీన్ సెల్ఫీ పాయింట్ తో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-02-28 14:09:59

Share: Share


గ్రీన్ సెల్ఫీ పాయింట్ తో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు మా పాఠశాలలో అత్యంత ఉత్సాహభరితంగా, సృజనాత్మక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల వైజ్ఞానిక ప్రతిభకు వేదికగా మారిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుంది అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు తెలియజేశారు

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య విచ్చేసి, విద్యార్థులు రూపొందించిన 40కి పైగా వైజ్ఞానిక నమూనాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రతి ప్రదర్శన వెనుక ఉన్న ఆలోచన, సమస్య పరిష్కార దృక్పథాన్ని అభినందిస్తూ, గ్రామీణ విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో మెరుగైన ప్రతిభ చూపగలరని ప్రశంసించారు.

జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విజయం సాధించిన విద్యార్థులకు అగస్త్య ఫౌండేషన్ సిరిసిల్ల జిల్లా కన్వీనర్లు బహుమతులు అందజేశారు. విద్యార్థులను ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను సన్మానించడం కార్యక్రమానికి ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది.

జిల్లా సైన్స్ అధికారి తన ప్రసంగంలో, “విద్యార్థులు పాఠశాల దశ నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుని, పరిశోధనా మనస్తత్వంతో ముందుకు సాగితేనే భవిష్యత్ భారత దేశ అభివృద్ధికి తోడ్పడగలరు” అని పేర్కొన్నారు.

పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ సెల్ఫీ పాయింట్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా A. P. J. Abdul Kalam మరియు C. V. Raman కట్‌ఔట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఉత్సాహంగా సెల్ఫీలు దిగుతూ శాస్త్రవేత్తల పట్ల గౌరవాన్ని వ్యక్తపరిచారు.

ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ వేడుకలు పాఠశాలలో శాస్త్రస్ఫూర్తిని మరింత బలపరిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనేక రకాల కార్యక్రమాల్లో నేను బిజీగా ఉన్నప్పటికిని మరి ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కృతకృతులైనటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు


ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు అగస్త్య ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >