Posted on 2026-02-28 15:09:47
వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశం
గంజాయి రహిత నగరంగా మారుద్దాం
గంజాయిను విక్రయించే కీలక వ్యక్తులను పట్టుకోండి.
అక్రమ ఇసుక రవాణాకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించండి
డైలీ భారత్, వరంగల్: దేశ భవిష్యత్తుయిన యువత గంజాయి మత్తు బానిసలు కాకుండా గంజాయి వియ్రించే మూలాలపై దృష్టి పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని శనివారం కాకతీయ మెడికల్ కళాశాలో ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ముందుగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులు, వారెంట్లు, అధికారులు, సిబ్బంది పనితీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పొలీస్ కమిషనర్ నేరాల నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ కమిషనరేట్ పరిధిలో పేకాటరాయుళ్ళపై కఠినంగా వ్యవహరించాలని, ప్రధానంగా శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని,చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని, అధికంగా చోరీలు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, అదే విధంగా యం.జి.యం, రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో సైతం సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు, కృషి చేయాలని, స్టేషన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలని, గంజాయి వినియోగదారున్ని పట్టుకోవడంతో మన బాధ్యత అయిపోతుందని అనుకొంకుండా గంజాయిని వియ్రించే వారి గుర్తించి అరెస్టు చేయాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, అక్రమ ఇసుక రవాణాపై స్టేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఎవరైన ఆలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని, అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్,రాజమహేంద్ర నాయక్,కవిత, శుభంనాగ్‌తో పాటు అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, అర్.ఐలు ఎస్.ఐలు పాల్గోన్నారు.
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >