Posted on 2026-03-02 09:31:56
డైలీ భారత్, సిరిసిల్ల: సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్స్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో చేస్తున్న జాప్యానికి నిరసనగా 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కే ఈశ్వర్ రావు, నలువాల స్వామి లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సెస్ లో పనిచేస్తున్న అసిస్టెంట్ హెల్పర్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సెస్ ఎండికి ఐదుసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని వారు పేర్కొన్నారు. ప్రతి నెల ఇచ్చే ఎఫ్ టి ఏ గత ఎనిమిది మాసాల నుంచి ఆపివేశారని 2025 సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సిన యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబ సభ్యులను రెగ్యులరైజ్ చేయలేదని సెస్ లో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ విధానం అమలు చేయడం లేదని వారు పేర్కొన్నారు ఏ హెచ్ లుగా పిలువబడే కార్మికులందరూ ఐటిఐ ఎలక్ట్రికల్ చేసిన వారేనని టెక్నికల్ గా చూస్తే వారందరూ టెక్నీషియన్సే నని సెస్ లో మాత్రం అసిస్టెంట్ హెల్పర్లు అని పిలవడం వలన కార్మికుల ఆత్మ గౌరవాన్ని అవమానించడమేనని వారు అన్నారు అసిస్టెంట్ హెల్పర్ అనే పేరు పెట్టి అతి తక్కువ వేతనాలు ఇవ్వడం వంటి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని వారు వివరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ ఈ నెల 11 నుంచి ఈ నెల 14 వరకు 72 గంటలు విధులు బహిష్కరిస్తున్నట్లు వారు ప్రకటించారు ఈ 72 గంటల్లో వివిధ రూపాల్లో నిరసనలు కూడా తెలియజేస్తామని ఇప్పటికైనా సెస్ చైర్మన్, సెస్ ఎం డి లు కలిసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ తో సంప్రదింపులు చేసి సమస్యలు పరిష్కరించాలని వారు పేర్కొన్నారు సమావేశంలో సెస్ కమిటీ అధ్యక్షులు కర్నాల అనిల్ కుమార్ కార్యదర్శి ఎస్ శ్రీనివాసరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర మల్లేశం కోశాధికారి ఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >
హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం
Posted On 2026-08-13 19:52:00
Readmore >
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >