| Daily భారత్
Logo




కామారెడ్డి పట్టణ వైశ్యుల అనైక్యత వల్లనే మున్సిపల్ ఎన్నికలలో విఫలం

News

Posted on 2026-03-02 11:33:43

Share: Share


కామారెడ్డి పట్టణ వైశ్యుల అనైక్యత వల్లనే మున్సిపల్ ఎన్నికలలో విఫలం

రాజకీయ అభివృద్ధి తోనే వైశ్యులకు సామాజిక గౌరవం సాధ్యం

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐవిఎఫ్ నూతన కమిటీ అభినందన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్యుల అనైక్యత వల్లనే మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో వైశ్య అభ్యర్థులను గెలిపించు కోలేకపోయామని,ఆర్థికంగా ఎంత ఉన్నత స్థితికి ఎదిగిన రాజకీయంగా తగిన గుర్తింపు లేకపోతే సామాజిక గౌరవం వైశ్యులకు ఉండదని అన్నారు. మన ఉనికినే మనం కోల్పోతే సమాజంలో మనకు ఎలాంటి సహాయ సహకారాలు పొందడం సాధ్యం కాదని అన్నారు.

కామారెడ్డి మున్సిపల్ గత చరిత్రను పరిశీలిస్తే 15 సంవత్సరాలపాటు మున్సిపల్ చైర్మన్ లుగా అవకాశం కలిగిందని, గతంలో కామారెడ్డి మున్సిపాలిటీలో 6 గురు నుండి 8 మంది కౌన్సిలర్ లుగా గెలుపొందితే ఈ సారి ఒక్కరు మాత్రమే గెలుపొందడం చూస్తే రాజకీయంగా వైశ్యులు విఫలం కావడమే అని అన్నారు.ఇప్పటికే అవకాశాలు లేక రాజకీయంగా వెనుకబడి ఉన్నామని రాజకీయ అధికారంతోనే వైశ్యులకు మరింత గుర్తింపు లభిస్తుందని అన్నారు, సామాజిక సేవలో దేశంలోనే ఎవ్వరూ చేయని సేవలు వైశ్యులు చేస్తుంటే రాజకీయ అభివృద్ధిలో మాత్రం అట్టడుగు స్థాయిలో మిగిలిపోతున్నామని దానికి వైశ్య పెద్దలు బాధ్యత తీసుకుని భవిష్యత్తు వైశ్య తరాలకు ఆదర్శవంతమైన రాజకీయ అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

వైశ్యుల రాజకీయ అభివృద్ధికి అవసరమైతే పార్టీలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు కదలాలని,కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాల పరిస్థితి మరొక మారు వస్తే రాజకీయ భవిష్యత్తు కామారెడ్డిలో శూన్యంగా మారుతుందని అన్నారు.

ఐవిఎఫ్ చేస్తున్న సేవలను గుర్తించి ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతుల సుధాకర్,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు లకు సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లోనే మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను ఐవిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు.


ఈ కార్యక్రమానికి ఆహ్వానించి, సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు అధ్యక్షులు శెనిశెట్టి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి జూలూరి గంగాధర్,కోశాధికారి సోమిశెట్టి ఆంజనేయులు,ప్రోగ్రాం చైర్మన్ జక్సాని సంతోష్ మరియు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >