| Daily భారత్
Logo




ఉపాధ్యాయుల సంక్షేమమే పి ఆర్ టి యు తెలంగాణ లక్ష్యం

News

Posted on 2026-03-02 11:37:28

Share: Share


ఉపాధ్యాయుల సంక్షేమమే పి ఆర్ టి యు తెలంగాణ లక్ష్యం

ఉపాధ్యాయులే నా ఆశ, నా శ్వాస.....

పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి.

డైలీ భారత్, కామారెడ్డి: ఆదివారం రోజు కామారెడ్డి లో  పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర, జిల్లా బాద్యులతో సమావేశం అనంతరం విలేకరుల సమావేశం లో ప్రసంగించిన వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాషా పండితులకు, పిఈటిలకు, ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్స్ కి  పదోన్నతులు కల్పించడంలో పి ఆర్ టి యు తెలంగాణ కీలక పాత్ర పోషించిందని, రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ సమస్యలు అన్ని పరిష్కరించడానికి ముందుంటామని హామీ ఇవ్వడం జరిగింది.

1. సిపిఎస్ విధానం రద్దు పరిచి ఓ పి ఎస్ పునరుద్ధరించడం, 2003 డీఎస్సీ వారికి జీవో 57/4,57/5 అమలు పరచడం.

2. ఉమ్మడి సర్వీసు రూల్స్ సాధించడం

3. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు నిర్వహించడానికి కృషి చేయడం.

4. కేజీబీవీ లో పనిచేస్తున్న పిజిసిఆర్టి లకు, సిఆర్టి లకు మరియు ఎస్ఎస్ఎ లో పని అందరికీ "మినిమం టైం స్కేలు" ఇప్పించడం మరియు హెల్త్ కార్డులు ఇప్పించడానికి కృషి చేయడం.

5. మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న మరియు గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించడం.

6 ఎయిడెడ్ స్కూల్స్ ని ప్రభుత్వ పాఠశాలలో విలీనం చేయడం

కామారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం వారి హక్కుల సాధనలో కామారెడ్డి జిల్లా శాఖ క్రియాశీల పాత్ర పోషిస్తుందని, పదో తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డి జిల్లాకు కేటాయించడానికి పట్టు పట్టి సాధించారని జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు,ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం ను అభినందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకునూరి మురళి సారథ్యంలోని విద్యా కమిషన్ ఉపాధ్యాయులకు వేతనాలు తగ్గించాలని చెప్పడం అవివేకమని, విద్యకు కేటాయించే నిధులు ఖర్చుగా చూడకూడదని పెట్టుబడిగా చూడాలి అని, ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ పొందే విద్యార్థులు దేశానికి ఉత్తమ పౌరులుగా, అధికారులుగా నాయకులుగా ఎదుగుతారు అది పెట్టుబడికి ఫలితం గా మారుతుంది అని చెప్పారు.

ఈ సమావేశం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రత్నాకర్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ  ఎన్. చంద్రశేఖర్ రావు, జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్  రావు, ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం,  అధ్యక్షులు ఓంప్రకాష్ , రాష్ట్ర, జిల్లా బాధ్యులు ఆనంద్, వెంకట్, మారుతి తదితరులు పాల్గొన్నారు

Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >