| Daily భారత్
Logo




పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు

News

Posted on 2026-03-11 18:26:29

Share: Share


పోలీస్ స్టేషన్లలో పారదర్శక సేవలు

సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి

ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత

నూతన కానిస్టేబుళ్లను అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దాలి

విధుల్లో చురుకుతనం, నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి

సెక్షన్ ఇన్చార్జిల శిక్షణ కార్యక్రమంలో ఎస్పీ దిశానిర్దేశం

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈరోజు నిర్వహించిన సెక్షన్ ఇన్చార్జిల ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరును మెరుగుపరచడం మరియు పర్యవేక్షణను బలోపేతం చేయడంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన సెక్షన్ ఇన్చార్జిలతో ఎస్పీ గారు ముఖాముఖిగా మాట్లాడి, స్టేషన్లలో పిటిషన్ మేనేజ్‌మెంట్ సకాలంలో జరుగుతుందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎటువంటి పక్షపాతం లేకుండా పని విభజన జరగాలని సూచించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సెక్షన్ ఇన్చార్జిలకు ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడికి సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతిలో ఏకరూప నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. చట్టంపై ప్రజలకు విశ్వాసం పెరగాలంటే బాధితులకు సమయానికి న్యాయం అందడం అత్యంత ముఖ్యమని ఎస్పీ గారు నొక్కి చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని, తక్షణ పరిష్కారం అందించేలా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విచారణ ప్రక్రియలో పారదర్శకత పాటించినప్పుడే పోలీస్ శాఖపై ప్రజల గౌరవం మరింత పెరుగుతుందని తెలిపారు.

ముఖ్యంగా సీనియర్ సిబ్బంది తమ అనుభవాన్ని ఉపయోగించి కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు సరైన మార్గదర్శకత్వం అందించి వారిని ఉత్తమ పోలీసులుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతిరోజు విధులకు హాజరయ్యే ముందు ఆ రోజు చేయాల్సిన పనులను సరైన ప్రణాళికతో సిద్ధం చేసుకుంటే పని ఒత్తిడి తగ్గి, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, పీసీఆర్ సీఐ నరేష్, జిల్లాలోని వివిధ సెక్షన్ ఇన్చార్జిలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >
Image 1

అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీకాంత్

Posted On 2026-06-21 17:57:24

Readmore >
Image 1

పనసపండ్ల మాటున రూ. 1.93 కోట్ల అక్రమ గంజాయి రవాణా

Posted On 2026-06-21 17:54:40

Readmore >
Image 1

ప్రపంచానికే గొప్ప అత్యంత సంపద యోగ

Posted On 2026-06-21 17:51:22

Readmore >
Image 1

బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి

Posted On 2026-06-21 17:41:40

Readmore >
Image 1

బానోత్ భద్రు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-21 17:40:16

Readmore >
Image 1

పిల్లలకు విషమిచ్చి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-06-21 17:39:26

Readmore >