| Daily భారత్
Logo




బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

News

Posted on 2026-03-17 07:47:41

Share: Share


బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవు

నేరసమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీసు అధికారులందరితో నేర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.జిల్లాలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉన్న కేసులు వివరాలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి బాధ్యతగా కృషి చేయాలని అధికారులకు సూచించారు.క్రికెట్ బెట్టింగులు,ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా సమగ్ర విచారణ చేపట్టి నేరస్తులకు శిక్షపడేలా పనిచేయాలని తెలిపారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ కృషి చేయాలని సూచించారు.పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,డయల్ 100 నకు ఫోన్ రాగానే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలబడాలని సూచించారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులు,సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు తప్పవని హెచ్చరించారు.భద్రాచలంలో జరగబోయే శ్రీరామనవమికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.రాబోయే వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని దొంగతనాల నివారణకై ప్రజలను అప్రమత్తం చేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలియజేశారు.సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా నిత్యం అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు.శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించారాదని అన్నారు.మద్యం సేవించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వ్యక్తులపై నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ రాము,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ అశోక్,ఏవో మంజ్యా నాయక్,సిఐలు,ఎస్సైలు,జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >