Posted on 2026-03-17 07:55:16
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గడ్డి మందులను తక్షణమే నిషేధించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ బృందం అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి నివేదికను అందజేశారు.ప్రపంచవ్యాప్తం గా దాదాపు 70కి పైగా దేశాల్లో ఈ ప్రమాదకర రసాయనాలను నిషేధించారని తెలిపారు. కానీ మన దేశంలో ఇవి విచ్చలవిడిగా దొరుకుతు న్నాయని కమిషన్ పేర్కొంది.గ్రామీణ, తండా ప్రాంతాల్లో రైతులు క్షణికావేశంలో వీటిని తాగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ మందుల నిషేధాన్ని సమర్థిస్తోందని, ప్రజారోగ్యం దృష్ట్యా వీటిని అరికట్టాలని నివేదికలో వివరించారు. తెలంగాణలో ఈ మందులను నిషేధించడంతో పాటు, దేశవ్యాప్తంగా వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ రాయాలని ముఖ్యమం త్రిని కోరాడు. రైతు కమిషన్ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రాణాంతక మైన ఈ విష రసాయనాలను రాష్ట్రంలో నిషే ధించేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >