| Daily భారత్
Logo




అధికారుల, నాయకుల నిర్లక్ష్యం...

News

Posted on 2026-03-24 19:38:13

Share: Share


అధికారుల, నాయకుల నిర్లక్ష్యం...

రోడ్డుకు అడ్డంగా ఉన్న కొమ్మలను తొలగించిన ఆర్టీసీ డ్రైవర్

డైలీ భారత్, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రాయికల్ వెళ్ళే దారిలో మాదాపూర్, పైడిమడుగు, జోగినిపెల్లి, మైతాపూర్,వద్ద చెట్ల కొమ్మలు రోడ్డు పైకి వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నాయి. 

రెండు బస్ లు ఎదురుపడ్డపుడు వెళ్ళడానికి వీలు లేకుండా సైడు తీసుకుంటుంటే, కొమ్మలు తగిలి అద్దాలు పగిలిపోతున్నాయి. అయినా అధికారులు, స్థానిక నాయకులు పట్టించుకోక పోవడంతో రోడ్డుకు అడ్డంగా పెరిగి వాహనాలకు ఇబ్బందులు కలిగిస్తున్న చెట్టు కొమ్మలను ఆర్టీసీ డ్రైవర్ తిరుపతి స్వయంగా కత్తితో కొట్టి తొలగించాడు. 

ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. చాలాకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ సంబంధిత అధికారులకు, నాయకులకు చెప్పిన  చర్యలు తీసుకోక పోవడంతో డ్రైవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొమ్మలను తొలగించడం అవసరమని భావించి ఇలా చేశాడని స్థానికులు చెబుతున్నారు. 

డ్రైవర్ చర్యను కొందరు అభినందిస్తుండగా, మరికొందరు విధుల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >