| Daily భారత్
Logo




ఎస్సీ మాదిగ కులస్తులను బహిష్కరణ గురించి జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం

News

Posted on 2026-03-25 08:08:22

Share: Share


ఎస్సీ మాదిగ కులస్తులను బహిష్కరణ గురించి జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రం

డైలీ భారత్, కామారెడ్డి: నర్సన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులను గ్రామ నివాసులను గ్రామ బహిష్కరణ చేయుట గురించి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారికి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి 

ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గడ్డం రవి, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భాగయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకట రాములు, ఎమ్మార్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, ఏలూరి స్వామి మాట్లాడుతూ కామారెడ్డి మండలంలోని నరసన్నపల్లి గ్రామ ఎస్సీ మాదిగ కులస్తులను ఉగాది పండుగ రోజున అవమానించడమే కాకుండా, మా కుల దైవమైనటువంటి పోచమ్మ దేవాలయానికి సున్నం వేయలేదని , దానికి ముఖ్య కారణమైన గ్రామ సర్పంచ్ రవి, రజక కులస్తులైన బక్కోళ్ల సిద్దిరాములు, బక్కోళ్ల అంజయ్యలతో ఫోన్లో  మాట్లాడిన వాయిస్ రికార్డు ఉందని,ఈనెల 18 తేదీన జరిగిన విషయం పైన దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇట్టి విషయం పైన జిల్లా అదనపు  కలెక్టర్ విక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈనెల 30 తేదీన మాదిగ కులస్తులను అన్ని దేవాలయంలోకి నేనే తీసుక  వెళ్తానని మాట ఇచ్చారని తెలిపారు. మీయొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని  తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, దళిత సైన్యం వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపల్లి సుధాకర్, లెగ్గిల రాజు, రాజశేఖర్ ఏలూరి రాజు, నరసన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులు పాల్గొన్నారు.



Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >
Image 1

జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-26 19:31:31

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి

Posted On 2026-06-26 19:19:45

Readmore >
Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >