Posted on 2026-03-25 19:37:36
మానసిక సమస్యలు ఉన్న వారికి 14416 ద్వారా టెలీ మానస్ 24*7 అందుబాటులో
మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన కలెక్టర్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో డ్రగ్స్ ను నియంత్రించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై బుధవారం కలెక్టర్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్ డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.. డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్రతి శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. 14416 ఆన్లైన్ ద్వారా 24*7 టెలీ మానస్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. మానసికంగా ఇబ్బంది పడే వారికి ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారని తెలిపారు. డ్రగ్స్, మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ షాప్ లలో తనిఖీ చేయాలని సూచించారు.
మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించాలని, డీ అడిక్షన్ సెంటర్ లో చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు. అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ రజిత, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, డీఐఈఓ శరత్ కుమార్, డీఈఓ జగన్ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, వ్యవసాయ, డ్రగ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >