| Daily భారత్
Logo




సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

News

Posted on 2026-06-25 18:57:28

Share: Share


సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

డైలీ భారత్, వరంగల్: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి గొప్ప వరమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంలో సీఎం రిలీఫ్ ఫండ్ కీలక పాత్ర పోషిస్తోందని ఎంపీ పేర్కొన్నారు..

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.3,50,000 (మూడు లక్షల యాభై వేల) విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో  గురువారం ఎంపీ కడియం కావ్య స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులతో ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడి, ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని ధైర్యం చెప్పారు..

ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ,.. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో వైద్య ఖర్చులు భరించడం చాలా కష్టసాధ్యమవుతుందని అన్నారు. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సీఎం సహాయ నిధి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తోందని చెప్పారు. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సి వచ్చినప్పుడు లక్షల్లో ఖర్చు అవుతుండటంతో కుటుంబాలు అప్పుల పాలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు. అవసరమైన సహాయం కోసం ప్రజలు ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. కష్టకాలంలో తమకు ఆర్థిక చేయూత అందేలా చొరవ చూపిన ఎంపీ కడియం కావ్యకు లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

#PostByAdmin, #cmrevanthreddy #kadiyamkavya, #warangal #MemberOfParliament #CMReliefFund

Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >
Image 1

వరంగల్ : అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి

Posted On 2026-06-25 18:18:41

Readmore >