| Daily భారత్
Logo




రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

News

Posted on 2026-06-25 18:54:05

Share: Share


రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

పూజలు చేసి ప‌నులు ప్రారంభించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

డైలీ భారత్, హైదరాబాద్: వ‌ర‌ద‌ల క‌ట్ట‌డితో పాటు.. భూగ‌ర్భ జ‌లాల‌ను పెంపొందించాల‌నే ల‌క్ష్యంతో చేప‌ట్టిన చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌లో మ‌రో 4 చెరువుల ప‌నుల‌కు హైడ్రా గురువారం శ్రీ‌కారం చుట్టింది. ఐటీ కారిడార్‌కు చేరువ‌లోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం ఇబ్ర‌హీంబాగ్లోని ఇబ్ర‌హీం పెద్ద చెరువు, గండిపేట మండ‌లం, పుప్పాల‌గూడ‌లోని భ‌గీర‌థ‌మ్మ చెరువు, కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం మూసాపేట‌లోని కాముని చెరువుతో పాటు మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కాప్రాలోని కాప్రా చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్రారంభించారు. 

ఇబ్ర‌హీం చెరువుతో పాటు.. కాముని చెరువుల వ‌ద్ద హైడ్రా కమిష‌న‌ర్ భూమి పూజ చేసి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. స్థానికులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని చెరువుల‌ను అభివృద్ధి చేస్తున్నందుకు హైడ్రాకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. చెరువు అభివృద్ధితో మురుగు స‌మ‌స్య‌తో పాటు.. దోమ‌ల బెడ‌ద త‌ప్పించ‌డ‌మే కాకుండా.. ఈ ప్రాంతాలు ఆహ్లాదంగా మారుస్తున్నందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాముని చెరువును 48 ఎక‌రాలు, ఇబ్ర‌హీం పెద్ద‌చెరువు 97 ఎక‌రాలు, 54 ఎక‌రాల్లో భ‌గీర‌థ‌మ్మ చెరువు, 112 ఎక‌రాల్లో కాప్రా చెరువును అభివృద్ధి చేస్తున్నారు. ఈ నాలుగు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌కు రూ. 107 కోట్లు వెచ్చిస్తున్నారు. 

వ‌ర‌ద క‌ట్ట‌డికి వీలుగా చెరువులు..

చెరువుల్లో పూడిక‌ను మొత్తం తొల‌గించి.. దుర్గంధం పోయేలా చూడాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌ట్టిన కాంట్రాక్ట‌ర్ల‌కు సూచించారు. వ‌ర‌ద‌ల క‌ట్ట‌డితో పాటు.. భూగ‌ర్భ జ‌లాలు పెంపుద‌ల ల‌క్ష్యంగా చెరువుల‌ను అభివృద్ధి చేయాల‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఆకాంక్షించారు. 

చెరువులోకి వ‌ర‌ద నీరు సాఫీగా వ‌చ్చేలా ఇన్‌లెట్లు, బ‌య‌ట‌కు వెళ్లేలా ఔట్‌లెట్లు అభివృద్ధి చేయాల‌న్నారు. మొద‌టి విడ‌త అభివృద్ధి చేసిన 6 చెరువుల మాదిరే రెండో విడ‌త చేప‌ట్టిన 14 చెరువుల‌ను తీర్చిదిద్దాల‌ని.. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా చేయాల‌న్నారు. చెరువుచుట్టూ పాత్‌వేలు, అన్ని వ‌య‌సుల‌వారూ సేద‌దీరేలా ఏర్ప‌ట్లు చేయ‌డంతో పాటు.. ఓపెన్ జిమ్‌లు, పిల్ల‌ల ప్లే ఏరియాలు ఇలా ఒక ప‌ర్యాట‌క కేంద్రంగా మార్చాల‌న్నారు. పెద్ద చెరువుల్లో ప‌ర్యాట‌క శాఖ ద్వ‌రా బోటింగ్ వ్య‌వ‌స్థ కూడా అందుబాటులోకి వ‌చ్చేలా ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ల‌కు రూపొందిస్తోంద‌న్నారు.  చెరువుల అభివృద్ధిలో స్థానికులు ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని సూచించారు. అభివృద్ధి ప‌నులు బాగా జ‌రిగేలా స‌హ‌క‌రించాల‌న్నారు.

Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >
Image 1

వరంగల్ : అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి

Posted On 2026-06-25 18:18:41

Readmore >