Posted on 2026-06-25 18:38:19
డ్రగ్స్ రహిత భారత నిర్మాణానికి యువత ఒక్క అడుగు ముందుకు వేయాలి
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
వేలాది మంది విద్యార్థులతో భారీ యాంటీ డ్రగ్స్ ర్యాలీ – నిజాంసాగర్ చౌరస్తాలో మానవహారం, ప్రతిజ్ఞ
డ్రగ్స్‌పై సమరశంఖం పూరించి "నషా ముక్త్ భారత్"కు వేలాది మంది ప్రతిజ్ఞ
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ యాంటీ డ్రగ్స్ ర్యాలీ
డైలీ భారత్, కామారెడ్డి:డ్రగ్స్ ఒక వ్యక్తినే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయని, మాదకద్రవ్యాలపై ప్రతి యువకుడు యోధుడిగా మారాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్., అన్నారు. డ్రగ్స్ రహిత కామారెడ్డి జిల్లా నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న "నషా ముక్త్ భారత్" వారోత్సవాల్లో భాగంగా, అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
నిజాంసాగర్ చౌరస్తా నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్., ప్రారంభించారు. విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు.
అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి మాదకద్రవ్యాలను దూరం పెడతామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్., మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయని అన్నారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ అనే మహమ్మారికి దూరంగా ఉండాలని సూచించారు.
ఒకసారి ఈ వ్యసనానికి బానిసైతే జీవిత లక్ష్యాలు, విలువలు, కుటుంబ బంధాలు అన్నీ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి విద్యార్థి డ్రగ్స్‌కు "నో" చెప్పడమే కాకుండా, తన స్నేహితులను కూడా ఈ దుష్ప్రవర్తన నుంచి దూరంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అనుమానాస్పద మాదకద్రవ్యాల విక్రయాలు లేదా అక్రమ రవాణా గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే "నషా ముక్త్ భారత్" లక్ష్యాన్ని విజయవంతం చేయగలమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ మురళి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు, జిల్లా సంక్షేమ సూపరింటెండెంట్ అరుంధతి, డీసీపీయూ అధికారులు, వివిధ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >