| Daily భారత్
Logo




కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

News

Posted on 2026-06-25 18:33:22

Share: Share


కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లాలో యూరియా నిల్వలు, పంపిణీ విధానం, రైతుల అవసరాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.

అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ

కామారెడ్డి జిల్లా రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

గత సంవత్సరం జూలై నెల వరకు కామారెడ్డి నియోజకవర్గానికి మొత్తం 140 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు గుర్తు చేసిన షబ్బీర్ అలీ, ఈ సంవత్సరం జూన్ 20వ తేదీ నాటికే 150 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వెల్లడించారు.

ఇది గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అని పేర్కొన్నారు.

అదనంగా రాబోయే రోజుల్లో మరింత యూరియా నిల్వలను జిల్లాకు తరలిస్తున్నామని, రేపు సాయంత్రం వరకు మేడ్చల్  నుండి 3,500 టన్నులు కూడా కొత్త స్టాక్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 

రాష్ట్ర అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడారు

రైతుల అవసరాలకు అనుగుణంగా నిరంతర సరఫరా కొనసాగుతుందని చెప్పారు.

కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం యూరియా కొరత ఉందంటూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

రైతులు అలాంటి ప్రచారాలను నమ్మకుండా అధికారులతో, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

రైతులకు తగినంత యూరియా అందించడం ప్రభుత్వ బాధ్యత అని, రైతుల అవసరాలపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.

జిల్లాలోని ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.

వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్న ఆయన, రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తమ వ్యవసాయ పనులను కొనసాగించాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >
Image 1

వరంగల్ : అక్రమ పచ్చడి తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి

Posted On 2026-06-25 18:18:41

Readmore >
Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >