Posted on 2026-06-25 18:23:12
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. పల్స్ పోలియో, నులిపురుగుల మాత్రల పంపిణీ, సీజనల్ వ్యాధుల సన్నద్దతపై వైద్య ఆరోగ్య శాఖ, వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీతో కలిసి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పల్స్ పోలియో పై రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్. అధికారులు ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో 0 నుంచి ఐదేండ్లలోపు పిల్లలు 41,147 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 393 వాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 38 సూపర్ వైజర్లను నియమించామని వెల్లడించారు. 15 మొబైల్ టీంలు ఏర్పాటు చేశామని వివరించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీఓలు, మెడికల్ అధికారులతో కలిసి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసి తమ పరిధిలోని 0 నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో వాక్సిన్ వేయించాలని, ఈ విషయమై అన్ని విద్యాలయాలలో ప్రార్దన సమయంలో, నోటీసు బోర్డులో రాయించాలని, మహిళా సంఘాల సమావేశాల్లో దీనిపై చర్చించాలని సూచించారు. అన్ని అంగన్వాడి కేంద్రాల పరిధిలో 0 నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో వాక్సిన్ అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల పరిధిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి పిల్లలకు వాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని స్పష్టం చేశారు.
నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలి
జిల్లాలో ఏడాది నుంచి 19 ఏండ్లలోపు వయసు వారికి నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 1,33,695 మందికి జూలై (వచ్చే నెల) 13వ తేదీన వేస్తారని, అదే నెల 20వ తేదీ వరకు ఏడాది నుంచి 19 ఏండ్లలోపు వయసు వారికి అందేలా పకడ్బందీ ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయాలని సూచించారు. లక్ష్యాన్ని పూర్తి చేసి.. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
వారంలో రెండు రోజులు డ్రై డేగా పాటించాలి
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డేగా పాటించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. డెంగీ వ్యాప్తి చేసే దోమలు నిలువ ఉన్న మంచి నీటిలో పెరుగుతాయని తెలిపారు. వానాకాలం నేపథ్యంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అన్ని ఇండ్లలో పాత టైర్లు, కూలర్లు, ఇతర పాత్రలు, ఇంట్లో, ఇంటి ఆవరణలో నీరు నిలువ ఉండకుండా చూడాలని సూచించారు. నిలువ నీటిని తొలగించాలని తెలిపారు. ఫాగింగ్ యంత్రాలు పూర్తి స్థాయిలో వినియోగించాలని, క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలలో పారిశుధ్య పనులు చేయించాలని, ఆవరణ శుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు ఆవరణ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, దీంతో అన్ని వ్యాధులు దూరం అవుతాయని తెలిపారు.
సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా,లోకేష్, వైద్యులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
#Sircilla #sircillacollector #garimaagrawalias #sircillanews #sircillaupdates #rajannasircilla #sircilla_rajanna_district
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >