Posted on 2026-06-25 18:31:09
“ఆపరేషన్ కవచ్” లో జంతువుల అక్రమ వేటగాళ్ల ముఠా గుట్టురట్టు– 8 మంది నిందితుల అరెస్ట్
5 నాటుతుపాకులు, 1 ఎయిర్ గన్, భారీగా వేట సామగ్రి, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం
ఆపరేషన్ కవచ్‌లో మరో కీలక కేసు ఛేదించిన గాంధారి పోలీసులు
నేరస్థులకు సింహస్వప్నం “ఆపరేషన్ కవచ్” ప్రజల భద్రతే మా లక్ష్యం.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు చట్టవ్యతిరేక అక్రమ కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ కవచ్” కార్యక్రమం మరోసారి అద్భుత పలితాన్ని ఇచ్చింది. అడవి జంతువుల అక్రమ వేటకు పాల్పడుతున్న 8 మంది సబ్యులు గల ముఠాను గాంధారి పోలీసులు పట్టుకోవడం, నేరస్తుల వద్ద నుంచి భారీగా నాటుతుపాకులు, పేలుడు పదార్థాలు మరియు వేట సామగ్రిని స్వాధీనం చేసుకుని జిల్లాలో అక్రమ కార్యకలాపాలకు తావులేదని తెలియజేయడం జరుగుతుంది.
వివరాల్లోకి వెళితే.. తేదీ 24.06.2026న రాత్రి సమయంలో గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మొండి సడక్ చౌరస్తా వద్ద గాంధారి ఎస్ఐ మహేందర్ మరియు పోలీసు సిబ్బంది "ఆపరేషన్ కవచ్" లో భాగంగా ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు మోటార్ సైకిళ్లపై ఐదుగురు వ్యక్తులు వచ్చి పోలీసుల వాహన తనిఖీలు ముమ్మరంగా చేయడం గమనించి కొంత దూరం నుండే వెనుదిరిగి పారిపోవడానికి ప్రయత్నించారు. గాంధారి ఎస్ఐ మరియు సిబ్బంది వెంటనే స్పందించి, అత్యంత చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అక్రమ నాటుతుపాకులు, గన్‌పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్ (చెర్రలు), ఫెల్ట్స్ తదితర ప్రమాదకర వేట సామగ్రి లభ్యమవడంతో ఆదేవిదముగా పట్టుబడినవారు పొంతన లేని సమాధానాలు చెప్పడముతో పోలీసులు ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లాలో అక్రమంగా తుపాకులు, పేలుడు పదార్థాలతో ముఠా సంచరిస్తున్న సమాచారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ సూచనల మేరకు పట్టుబడిన వారియొక్క పూర్తి నెట్వర్క్ ఛేదించడానికి మరియు ఆయుధాలను రికవరీ చేయడానికి పక్కా ప్లాన్‌తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ దిశానిర్దేశంలో, ఎల్లారెడ్డి డీఎస్పీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో.. సదాశివనగర్ సీఐ, గాంధారి, తాడ్వాయి ఎస్ఐ మరియు సిబ్బందితో కూడిన మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకిదిగి అత్యంత సమన్వయంతో విచారణను వేగవంతం చేశాయి.
పోలీసుల విచారణలో పట్టుబడిన నిందితులు అడవి జంతువుల వేట కోసం అక్రమంగా నాటుతుపాకులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు తెలిసింది. జంతువుల అక్రమ వేటకు అటవీ ప్రాంతానికి వెళ్లినప్పటికీ వర్షం పడడంతో అనుకూలించక వెనుతిరుగు సమయములొ పోలీసుల తనిఖీల్లో చిక్కినట్లు వెల్లడించారు. తనిఖీలలొ విస్లావత్ గోపీచంద్ నడుపుతున్న బజాజ్ మోటార్ సైకిల్‌పై ఒక వ్యక్తి నాటుతుపాకీతో ఉండగా, ఆంగోతి లక్ష్మణ్ నడుపుతున్న హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్‌పై విస్లావత్ నాను వేట సామగ్రి ఉన్న సంచితో, అలాగే విస్లావత్ గణేష్ మరో నాటుతుపాకీతో ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్పాట్ లోనే వారి నుండి 2 నాటుతుపాకులు, సామగ్రి, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
నెట్వర్క్ గురించి ఆరా తీయగ సుమారు మూడు నెలల క్రితం ఆంగోత్ ధర్మ నాయక్ మరియు సలావత్ చందర్ ల మధ్యవర్తిత్వంలో, బాన్సువాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ వద్ద నుంచి ఒక్కో నాటుతుపాకిని రూ.10,000/- చొప్పున కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడినది. అంతేకాకుండా, తాము కొనుగోలు చేసిన మొత్తం ఐదు నాటుతుపాకులలో మూడింటికి ట్రిగ్గర్ మెకానిజంలు లేకపోవడంతో వాటిని గండివేట్ తండా సమీపంలోని వ్యవసాయ పొలంలో దాచిపెట్టినట్లు తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు వెంటనే గండివేట్ తండా పరిసర ప్రాంతాల్లో గాలింపు సోదాలు నిర్వహించి, అక్కడ దాచిపెట్టిన మరో 3 నాటుతుపాకులను రికవరీ చేయడం జరిగినది
ఈ కేసు దర్యాప్తును ఇలాగే కొనసాగిస్తూ.. ప్రత్యేక బృందాలు చిన్నరాంపూర్ గ్రామ సమీపంలోని ఒక కోళ్ల ఫారం (పౌల్ట్రీ ఫామ్) వద్ద షెల్టర్ తీసుకున్న మిగతా నిందితులైన సలావత్ చందర్ (A-6), ఆంగోత్ ధర్మ నాయక్ @ ధర్మ (A-7), మరియు ప్రధానంగా నాటు తుపాకులు సరఫరా చేసిన అస్లాం చావుస్ (A-8) లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి వేటకు ఉపయోగించే మరో 3 చాప్స్ (Barrels), 1-ఎయిర్ గన్, 3-ట్రిగ్గర్ మెకానిజంలు మరియు స్టీల్ పెలెట్స్ (చెర్రలు) లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా అక్రమ వేట ముఠా యొక్క పూర్తి నెట్వర్క్ కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది.
అరెస్టు చేయబడిన నిందితుల వివరాలు:
(A-1) – విస్లావత్ అరుణ్ , విస్లావత్ గోపిచంద్ (A-2) – ఆంగోత్ లక్ష్మణ్ (A-3) విస్లావత్ నాను (A-4) –విస్లావత్ గణేష్ (A-5) – A1 TO A5 గండివేట్ తండా, గాంధారి మండలం, (A-6) సలావత్ చందర్, హజీపూర్ గ్రామం, నస్రుల్లాబాద్.
(A-7) ఆంగోత్ ధర్మ నాయక్ @ ధర్మ, నాగధార్ రాంచందర్ తండా, నిజాంపేట్ మండలం, సంగారెడ్డి జిల్లా.
(A-8) అస్లాం చావుస్, చిన్నరాంపూర్ గ్రామం, బాన్సువాడ మండలం.
స్వాధీనం చేసుకున్న సామగ్రి: నాటుతుపాకులు-5, ఎయిర్ గన్-1, ట్రిగ్గర్ మెకానిజంలు- 3, చాప్స్ (Barrels)- 3, మందుగుండు & వేట సామగ్రి- స్టీల్ పెలెట్స్ (చెర్రలు), గన్‌పౌడర్, పొటాష్, ఫెల్ట్స్ మరియు ఇతర సామాగ్రి, వాహనాలు- 2 (బజాజ్ మరియు హెచ్ఎఫ్ డీలక్స్).
అక్రమ ఆయుధాల సరఫరా, వన్యప్రాణుల వేట ముఠా నెట్వర్క్ ను సమర్థవంతంగా ఛేదించి, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్, తాడ్వాయి ఎస్ఐ నరేష్, మరియు పోలీస్ సిబ్బంది సంతోష్, పెంటయ్య, హోంగార్డ్ వీరప్రసాద్‌లను కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి వారికి నగదు బహుమతులు (రివార్డులు) అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
జిల్లాలో అక్రమ ఆయుధాల సంస్కృతికి, వన్యప్రాణుల వేటకు తావులేదని హెచ్చరించారు. నేరస్థులకు సింహస్వప్నంగా, ప్రజలకు రక్షణకు భరోసాగా “ఆపరేషన్ కవచ్” ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని, చట్టవ్యతిరేక చర్యలపై ఉక్కుపాదం మోపుతామని జిల్లా యస్ పి గారు స్పష్టం చేయడం జరిగింది.
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >
పిల్లల ఆన్లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >