Posted on 2026-06-25 18:35:11
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలి అని డీఎంహెచ్‌ఓ డా. జె. వెంకటి
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డా. జె. వెంకటి గురువారం ఐడీఓసీ (IDOC) సమావేశ మందిరం, కామారెడ్డిలో జిల్లా పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు (MOs), కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (CHOs), ఆరోగ్య విద్యాధికారులు (HEOs), హెల్త్ సూపర్వైజర్లు (HSs) మరియు జిల్లా కార్యక్రమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP), జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLEP), జాతీయ వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (NVBDCP), సార్వత్రిక టీకాల కార్యక్రమం (UIP), మాతా-శిశు ఆరోగ్య సేవలు (RMNCH+A), కుటుంబ నియంత్రణ కార్యక్రమం, జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (NP-NCD), జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం (NMHP), జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (NTCP), అనీమియా ముక్త్ భారత్, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మరియు వెల్‌నెస్ కేంద్రాల సేవలు, IDSP, తదితర కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
డీఎంహెచ్‌ఓ డా. జె. వెంకటి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్షయ, కుష్ఠు వ్యాధుల కేసులను ముందస్తుగా గుర్తించి పూర్తి స్థాయిలో చికిత్స అందించడంతో పాటు, అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, అతిసార వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు, దోమల నివారణ చర్యలు మరియు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు.
అలాగే జిల్లాలోని గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంతో పాటు పూర్తి స్థాయి టీకా కవరేజీ 100% సాధించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కుటుంబ నియంత్రణ సేవలు, కిశోర బాలబాలికల ఆరోగ్య కార్యక్రమాలు మరియు పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఆరోగ్య మరియు వెల్‌నెస్ కేంద్రాల ద్వారా అందిస్తున్న సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, అవసరమైన మందులు, నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆరోగ్య శాఖకు సంబంధించిన అన్ని ఆన్‌లైన్ పోర్టల్స్, రిజిస్టర్లు మరియు నివేదికలను సకాలంలో నవీకరించాలని ఆదేశించారు.
ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఆరోగ్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్న డీఎంహెచ్‌ఓ, జిల్లాలో ఆరోగ్య సూచికలను మెరుగుపరచేందుకు సమన్వయంతో పనిచేసి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలపాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యక్రమ అధికారులు Dr. రోహిత్ కుమార్, DR. ప్రదీప్ కుమార్, Dr. వెంకట్ స్వామి,మహేందర్ రెడ్డి,గాలమ్మా వేణు గోపాల్,చలపతి,పద్మజ, జానాబాయ్, మరియు వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆరోగ్య విస్తరణాధికారులు, హెల్త్ సూపర్వైజర్లు మరియు ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్
Posted On 2026-06-25 18:57:28
Readmore >
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి
Posted On 2026-06-25 18:35:11
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-06-25 18:33:22
Readmore >
ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-25 18:23:12
Readmore >
ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి
Posted On 2026-06-25 18:21:26
Readmore >
పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >