Posted on 2026-03-27 18:45:58
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వప్నలోక్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని స్వప్నలోక్ కార్యవర్గం, కాలనీవాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని ఆలయ అర్చకులు శ్రీహర్ష తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ రామనవమి సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయంలో అఖండ నామము, సుప్రభాతసేవ, మూల విరాట్లకు, ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, మంగళస్నానం, సహస్రనామార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, 11వ వార్డ్ కౌన్సిలర్ రాణి శ్రీనివాస్, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >