Posted on 2026-03-27 22:22:33
జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మరియు బాన్సువాడ పట్టణాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ తెలిపారు. భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా పండుగను జరుపుకునేలా అన్ని కీలక ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని మోహరించడం జరిగింది.
పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా సర్వే లెన్స్ 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ వ్యాన్ పై , డ్రోన్ల సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని ఎస్పీ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లా ఎస్పీ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మతసామరస్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని మరొక్కసారి గుర్తు చేశారు
వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత
Posted On 2026-06-18 11:50:02
Readmore >
విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్
Posted On 2026-06-17 19:36:50
Readmore >
సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం
Posted On 2026-06-17 19:30:07
Readmore >
ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్
Posted On 2026-06-17 19:25:04
Readmore >
తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-17 19:23:26
Readmore >
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >