| Daily భారత్
Logo




విద్యార్థినిపై ఉపాధ్యాయుల వేధింపులు

News

Posted on 2026-03-29 13:26:23

Share: Share


విద్యార్థినిపై ఉపాధ్యాయుల వేధింపులు

డైలీ భారత్, మేడ్చల్:మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిపై లెక్చరర్లు వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. కాప్రాకు చెందిన తిరునాయన అనే విద్యార్థిని, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తన తల్లితో కలిసి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం బీఎస్సీ డేటా సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు, అనారోగ్య కారణాలతో కళాశాలకు తరచూ హాజరు కాలేకపోయారు. ఇందుకు సంబంధించి వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లిస్తూ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. అయితే, మొదటి సంవత్సరం నుంచే లెక్చరర్లు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన ఫోన్‌లోని ఫోటోలను షేర్ చేస్తూ, వ్యక్తిత్వంపై అసత్య ప్రచారాలు చేశారని ఆరోపించారు.

ఇటీవల మళ్లీ అనారోగ్యం బారిన పడగా.. “కళాశాలకు రాకుండా ఎవరితో తిరుగుతున్నావు?” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి మానసిక ఒత్తిడికి గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమార్తెను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లి డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు

Posted On 2026-04-13 11:03:05

Readmore >
Image 1

యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం

Posted On 2026-04-13 08:36:04

Readmore >
Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >