Posted on 2026-03-29 21:48:06
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS
డైలీ భారత్, నారాయణపేట జిల్లా: మద్దూరు మండలం మోమినపుర్ గ్రామంలోని ZPHS పాఠశాలలో మైనర్ బాలికకు సంబంధించిన ఘటనలో మొత్తం 7 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు పంపినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 చండేపల్లి స్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పెదిరపాడు గ్రామానికి చెందిన ఇతను తన అధికారాన్ని దుర్వినియోగం చేసి బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు సీసీ కెమెరాలలో నమోదు కాగా అట్టి సీసీ కెమెరాలు A2 గుర్నాథ్ రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఏర్పాటుచేసి ఆ వీడియోను A3 కర్ని చెన్నకేశవులు, ప్రభుత్వ, ఉపాధ్యాయుడు దాచిపెట్టి ఇతర నిందితులు A4 గుల్ల రవికుమార్, A5 బి ఆనంద్, A 6 విజయ్ కుమార్, A 7 మేకల రవి, సాక్ష్యాలను దాచిపెట్టడం, వీడియోను అనధికారికంగా పంచుకోవడం అదే గ్రామంలో డబ్బులకు రాజీ ప్రయత్నాలు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు తెలిపారు.
ఈ కేసు విచారణ డీఎస్పీ నల్లపు లింగయ్య చేపట్టగా అట్టి మైనర్ బాలిక పై ప్రధాన నిందితుడు పాలు మార్లు అత్యాచారానికి పాల్పడినాడని విచారణలో వెల్లడైంది, అతనిపై, అతనికి సహకరించిన వ్యక్తులపై పోక్సో, ఐటీ, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని మొత్తం 7 మందిని రిమాండ్‌కు పంపడం జరిగిందని ఎస్పీ తెలిపారు.
నారాయణపేట జిల్లాలో, విద్యాసంస్థల్లో విద్యార్థులు భద్రత అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నామని, ఇలాంటి ఘటనలు ఎక్కడైనా జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా అత్యవసర సమయంలో డయల్ 100 కి లేదా 112,1098 కి తెలియజేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
సమస్యలను చట్టపరంగా పరిష్కరించకుండా స్వయంగా రాజీ ప్రయత్నాలు చేయడం లేదా నేరాలను దాచిపెట్టడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్రమైన నేరాలుగా పరిగణించి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >