| Daily భారత్
Logo




ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో సైబర్ మోసాలు

News

Posted on 2026-03-29 21:52:30

Share: Share


ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల పేరుతో  సైబర్ మోసాలు

అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తాo అంటూ అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల మోసాలు.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్

డైలీ భారత్, కర్నూలు : ఇంజనీరింగ్, మెడికల్ మరియు బీటెక్ సీట్ల పేరుతో అడ్వాన్స్ పేమెంట్లు తీసుకుంటూ జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

కొందరు సైబర్ నేరగాళ్లు ప్రముఖ కళాశాలలు, విశ్వవిద్యాలయాల పేరుతో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా సంప్రదిస్తూ “మేనేజ్‌మెంట్ కోటా సీట్ల ” పేరుతో అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు అడిగి మోసాలు చేస్తారన్నారు.

అడ్మిషన్ గ్యారంటీ, తక్కువ ఫీజుతో సీటు కల్పిస్తామని చెప్పి అమాయక విద్యార్థులు, తల్లిదండ్రులను మోసాలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయన్నారు .

జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు...

ఏ కళాశాల సీటు కోసం అయినా అధికారిక వెబ్‌సైట్ లేదా కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే దరఖాస్తు చేయాలి.

ఫోన్ కాల్స్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఆఫర్లను నమ్మి డబ్బులు పంపవద్దు.

వ్యక్తిగత బ్యాంక్ వివరాలు, OTPలు ఎవరికీ ఇవ్వకూడదు.

అనుమానాస్పద లింకులు, APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దు.

ఎవరైనా సైబర్ మోసానికి గురి అయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. 

జరిగిన సైబర్ నేరం గురించి వెంటనే లేదా ఒక గంటలోపు ఫిర్యాదు చేస్తే మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని కర్నూల్ ఎస్పీ తెలిపారు. 

విద్యార్థులు మరియు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, కేవలం అధికారిక విధానాల ద్వారానే అడ్మిషన్లు పొందాలని కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

#APPOLICE100 #AndhraPradeshPolice

#PoliceKurnool #APPolice #appolice

Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >