Posted on 2026-03-30 08:06:35
బంగారు,వెండి,కాంస్య పతకాలు అందుకున్న జిల్లా క్రీడా కారులు
డైలీ భారత్, కామారెడ్డి: క్రీడల్లో సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంగా వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో ఈ నెల 28,29 తేదీల్లో హైదరాబాదు లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ క్రీడా పోటీలు నిర్వహించిన సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని బ్యాట్మెంటన్ క్రీడాకారులు ఒక బంగారు పతకం,ఒక వెండి పతకం,4 కాంస్య పతకాలు అందుకోవడం జరిగిందని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ (కామారెడ్డి జిల్లా ఇంచార్జి) చెల్లాపురం శ్రీకాంత్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఈ అథ్లెటిక్స్ క్రీడల్లో భాగంగా అథ్లెటిక్స్,బ్యాట్మెంటన్,చెస్, 2కే 3కే రన్,కరాటే, వంటి పోటీలలో ప్రతిభ కనపరచడమే కాకుండా పతకాలను పొందుకోవడం గొప్ప విషయం అన్నారు. క్రీడా ప్రతిభకు ప్రతీకగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు 6 పతాకాలు వరించాయని అన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >