Posted on 2026-04-01 16:23:00
వెంకట సాయి నగర్ కాలనీ ప్రజలకు అండగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ పటేల్
డైలీ భారత్, రామంతాపూర్: వెంకట సాయి నగర్ కాలనీలో కొన్నేళ్లుగా లో వోల్టేజ్ సమస్య కారణంగా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ పటేల్ ముందుకు వచ్చారు.
కాలనీలోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్న ఆయన, కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మరియు టీం సభ్యులతో కలిసి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ AE కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా AE కిరణ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అరుణ్ పటేల్ మాట్లాడుతూ,
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి మార్గదర్శకత్వం, సహకారంతో వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
వెంకట సాయి నగర్ కాలనీలో నెలకొన్న విద్యుత్ లో వోల్టేజ్ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందే వరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు ఆర్. గోవింద్, జి. అశోక్, సిహెచ్ శ్రీనివాస్ గౌడ్, నవీన్, విద్యాసాగర్, రమేష్, రాజు , రామకృష్ణ , భూపతి నరసింహ, శివకుమార్ , రమేష్ యాదవ్ , లక్ష్మణ్, పరశురాం, ఐలేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >