Posted on 2026-04-02 05:08:24
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: విద్యుత్ వినియోగదారులకు మరింత చేరువై, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో, విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు సెస్ ఎండీ బిక్షపతి తెలిపారు. కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు, వినియోగదారుల పేరు మార్పు, విద్యుత్ బిల్లుల చెల్లింపు వంటి సేవలను ఇప్పటి నుంచి ఏ మీసేవ కేంద్రంలో అయినా పొందవచ్చని ఎండీ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులు తమ సమీప మీ సేవ కేంద్రంలోనే సమస్త విద్యుత్ పనులను పూర్తి చేసుకోవచ్చన్నారు .
మీ సేవ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ముఖ్య సేవలు...
కొత్త విద్యుత్ కనెక్షన్ మంజూరు : గృహ, వ్యాపార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇప్పుడు ప్రతి మీ సేవ కేంద్రంలో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు స్వీకరణ నుండి మంజూరు వరకు మొత్తం ప్రక్రియ సులభతరంగా, పారదర్శకంగా నిర్వహించబడుతుంది.
వినియోగదారు పేరు మార్పు, విద్యుత్ బిల్లుల చెల్లింపు : మీ సేవ కేంద్రాల్లో నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చు.
ఇతర సేవలు : లోడ్ మార్పు, తాత్కాలిక కనెక్షన్, కనెక్షన్ తొలగింపు, మొదలైన అన్ని సేవలు కూడా మీ సేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు. వినియోగదారులు ఇప్పటి వరకు విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి ఇవ్వాల్సిన దరఖాస్తులను, ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్న ఏ మీసేవ కేంద్రంలో అయినా ఇవ్వొచ్చు అన్నారు. వినియోగదారుల సౌకర్యమే మా ప్రథమ లక్ష్యం" అని, పారదర్శకంగా నిర్వహించబడతాయని ఆయన స్పష్టం చేశారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >