Posted on 2026-04-02 16:47:44
డైలీ భారత్, అనకాపల్లి (చీడికాడ): చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన భారీ గంజాయి రవాణా కేసులో చోడవరంలోని 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎం.హరి నారాయణ ఈరోజు కీలక తీర్పును వెల్లడించారు. నేరం నిరూపితమైన ముగ్గురు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు ఒక్కొక్కరికి రూ.1,00,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
గత 13.10.2016న చీడికాడ మండలం, అప్పలరాజుపురం సమీపంలోని త్రిషింగ్ ఫ్లోర్స్, చేపలచెరువు వద్ద సుమారు 300 కిలోల గంజాయిని అక్రమంగా నిల్వ ఉంచి, తరలించేందుకు సిద్ధంగా ఉన్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులు పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి పది ప్లాస్టిక్ బస్తాలలో తరలిస్తుండగా, అప్పటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై జి.అప్పారావు మరియు వారి సిబ్బంది దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
శిక్ష పడిన నిందితుల వివరాలు:
కోర్టు ద్వారా శిక్ష ఖరారైన నిందితులు (అందరూ చీడికాడ మండలం, బైలపూడి గ్రామానికి చెందినవారు):
బొట్టా ఈశ్వరరావు (A-1), తండ్రి: పైడిబాబు.
గోకాడ తాతబాబు (A-5), తండ్రి: సన్నీ బాబు.
గోకాడ చెల్లు బాబు (A-6), తండ్రి: కుల్లు బాబు.
వీరిపై NDPS చట్టంలోని సెక్షన్ 20(b)(ii)(C) r/w 8(c) కింద నేరం రుజువు కావడంతో, గౌరవ న్యాయమూర్తి గారు శిక్షను ఖరారు చేశారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో నిందితులు అదనంగా మరో 2 ఏళ్ల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రాసెక్యూషన్ తరపున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాస్క్యూటర్ చీపురుపల్లి సూర్యనారాయణ ని, పకడ్బందీగా దర్యాప్తు చేసిన నాటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై జి.అప్పారావుని కోర్టు మానిటరింగ్ సెల్ మరియు చీడికాడ పోలీస్ సిబ్బందిని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసుల కృషిని, న్యాయస్థానం వెలువరించిన ఈ కఠిన తీర్పును ఎస్పీ స్వాగతించారు.
#AndhraPradeshStatePolice
#anakapallidistrict #anakapallipolice
#Andhra Pradesh Police
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >