| Daily భారత్
Logo




ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

News

Posted on 2026-04-04 17:46:15

Share: Share


ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో కలిసి ఆసుపత్రుల పనితీరు, అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ సేవలపై సమగ్రంగా సమీక్షించారు.

ఆరోగ్యశ్రీ సేవల అమలుపై వివరాలు సేకరించి, ఆసుపత్రుల్లో కొనసాగుతున్న నిర్మాణాలు, మరమ్మత్తుల పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి ఆసుపత్రి పరిస్థితిపై సూపరింటెండెంట్ల నుండి వివరాలు తెలుసుకుని, సిబ్బంది కొరత, వైద్యుల లభ్యత వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని స్పష్టం చేశారు.

భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరుగుదొడ్ల మరమ్మత్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించి, మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించి, పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రసవ సేవలపై సమీక్ష నిర్వహించి అవసరమైన మెరుగుదలలు చేపట్టాలని తెలిపారు.

ఆసుపత్రుల్లో పరిశుభ్రత కోసం తగిన శానిటేషన్ సిబ్బంది ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకుల పనితీరు, రక్త నిల్వలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, సికిల్ సెల్ అనీమియా కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.


ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

#BhadradriKothagudem #Healthcare #Aarogyasri #Telangana

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >